AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: బైక్‌పై విన్యాసాలతో జంటకు యాక్సిండెంట్ చేసి యువతి జంప్.. మండిపడుతున్న నెటిజన్లు..

 తాజాగా ఓ అమ్మాయి బైక్‌పై వేగంగా వెళుతూ విన్యాసాలు చేసుకుంటూ వెళుతూ ఓ జంటను కిందపడేసింది. అయితే యాక్సిడెంట్‌కు కారణమైన యువతి మాత్రం తన బైక్ ఆపకుండా..

Trending Video: బైక్‌పై విన్యాసాలతో జంటకు యాక్సిండెంట్ చేసి యువతి జంప్.. మండిపడుతున్న నెటిజన్లు..
Girl Bike Rash Driving..
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 07, 2023 | 9:40 AM

Share

కొంత మంది మెయిన్ రోడ్ల మీద ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా, విచక్షణారహితంగా వాహనాలు నడుపుతుంటారు. మరి కొందరు రోడ్డు మీద విన్యాసాలు చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంటారు. అలాంటి వారి వల్లనే ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయని కూడా చెప్పుకోవాలి. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ప్రతిసారీ వైరల్ అవుతుంటాయి. అయితే అలాంటి పనులు అబ్బాయిలు లేదా పురుషులే చేస్తారనుకుంటే చాలా తప్పు. ఎందుకంటే తాజాగా ఓ అమ్మాయి బైక్‌పై వేగంగా వెళుతూ విన్యాసాలు చేసుకుంటూ వెళుతూ ఓ జంటను కిందపడేసింది. అయితే యాక్సిడెంట్‌కు కారణమైన యువతి మాత్రం తన బైక్ ఆపకుండా.. ఏమీ ఎరగనట్లు తన దారిన తాను వెళ్లిపోయింది. ఇక ఈ యాక్సిడెంట్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ సంఘటనా సమయంలో ఆ రోడ్డు మీదనే ప్రయణిస్తున్న మరో వ్యక్తి.. ఆ యువతి విన్యాసాలను, చేసిన బైక్ యాక్సిండెంట్ దృశ్యాలను వీడియో తీశాడు. mcqueen_spee_d అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియో చూస్తే మొదటిలో కాసేపు నవ్వు వచ్చినా.. తరువాత ఏమైందో చూస్తే మీకు కూడా కచ్చితంగా కోపం వస్తుంది. అయితే ఈ ఘటన ఎక్కడ ఎప్పుడు జరిగిందో.. యాక్సిడెంట్ కారణంగా కిందపడిన జంటకు గాయాలయ్యాయా లేదా అనే విషయాలు తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియో ఇక్కడ చూసేయండి..

కాగా, ఈ వీడియోకు ఇప్పటివరకు 78 వేల లైకులు వచ్చాయి. అలాగే ఎంతో మంది షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు కామెంట్ల ద్వారా బైక్ రైడ్ చేసిన అమ్మాయి డ్రైవింగ్ స్కిల్స్‌పై మండిపడుతున్నారు. ఇంకా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. వారిలో ఒక నెటిజన్ ‘ఇలాంటి స్టంట్స్ వల్ల వాళ్లు ఇబ్బంది పడటమే కాకుండా.. ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తారు. ఈ అమ్మాయిపై కేసు నమోదు చేయాలి. అప్పుడే ఇలాంటి వాళ్లకు బుద్ధి వస్తుంది’ అంటూ రాసుకొచ్చాడుజ మరో నెటిజన్ ‘పాపా కీ పరీ డ్రైవింగ్ అంటే అంతే ఉంటుంద’ని అన్నాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..