Babu Mohan: బండి సంజయ్ ఎవడ్రా.. నువ్వెంత నీ బతుకెంత.. బాబూమోహన్‌ బూతు పురాణం..

తెలంగాణలో ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ తరుణంలో మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు బాబూ మోహన్ ఓ బీజేపీ కార్యకర్తపై బూతు పురాణంతో రెచ్చిపోయారు.

Babu Mohan: బండి సంజయ్ ఎవడ్రా.. నువ్వెంత నీ బతుకెంత.. బాబూమోహన్‌ బూతు పురాణం..
Babu Mohan Bandi Sanjay
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 07, 2023 | 1:11 PM

తెలంగాణలో ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ తరుణంలో మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు బాబూ మోహన్ ఓ బీజేపీ కార్యకర్తపై బూతు పురాణంతో రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డింగ్ ఒకటి సోషల్ మీడియలో తెగ వైరల్ గా మారింది. ఏకంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నే.. బండి సంజయ్ ఎవడ్రా అంటూ.. బాబూ మోహన్ ఫోన్లో ఓ బీజేపీ కార్యకర్తపై రెచ్చిపోయారు. ఆదోల్ కు చెందిన వెంకట రమణ అనే ఓ బీజేపీ కార్యకర్త బాబూమోహన్ కు ఫోన్ చేసి.. సార్ నేను మీతో కలిసి పార్టీ కోసం పనిచేద్దామనుకుంటున్నాను.. అంటూ పేర్కొన్నారు. దీంతో నువ్వెంత నీ బతుకెంత నాతో కలిసి పనిచేస్తావా..? నేనెవరు నీకు తెలుసా..? నేను ప్రపంచ స్థాయి నాయకుడిని.. అటువంటి నాతో కలిసి పనిచేస్తావా..? నువ్వెంత నీ బతుకెంత.. మరోసారి ఫోన్ చేశావంటే చెప్పుతో కొడతా.. అంటూ బాబూమోహన్ రెచ్చిపోయారు.

అంతటితో ఆగకుండా.. బండి సంజయ్.. ఎవడ్రా వాడు.. నా తమ్ముడు అంటూ నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడు అంటూ రాయలేని విధంగా తిట్ల పురాణం అందుకున్నారు. మధ్య మధ్యలో అశ్లీల పదజాలంతో బూతు పురాణంతో రెచ్చిపోయారు. కాగా.. బీజేపీ కార్యకర్తపై బాబూమోహన్ మాట్లాడిన బూతు పురాణం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేను మంత్రిగా ఉన్నప్పుడే ఆదోల్‌ను అభివృద్ధి చేశా.. నువ్వెంతరా బచ్చాగాడివి నాకే ఫోన్ చేసి నాతో కలిసి పనిచేస్తానంటావా..? అంటూ ఇష్టానుసారంగా.. నొటికొచ్చిన విధంగా బాబూమోహన్ తిట్లతో రెచ్చిపోయారు.

పార్టీలో నేను కష్టపడి పనిచేశాను.. అందుకు అమిత్ షా అంతటి నాయకుడే నన్ను బీజేపీలో చేర్చుకున్నారు అంటూ పేర్కొన్నారు. ఇంకోసారి తనకు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానంటూ కార్యకర్తను హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కాషాయ పార్టీలో కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

అందోల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాబూమోహన్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత బీజేపీలో చేరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు