Vande Bharat Express: వందే భారత్ ట్రైన్‌కు తప్పిన ప్రమాదం.. ఎద్దును ఢీకొన్న రైలు
ఈ మధ్య కాలంలో ప్రారంభమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదాలు ఎదురవుతున్నాయి. రైలుపై రాళ్ల దాడి, ట్రాక్‌పై పశువులను ఢీకొనడం వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా..

ఈ మధ్య కాలంలో ప్రారంభమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదాలు ఎదురవుతున్నాయి. రైలుపై రాళ్ల దాడి, ట్రాక్‌పై పశువులను ఢీకొనడం వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎద్దును ఢీకొంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగుల పంచ సమీపంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. ఎదురుగా వచ్చిన ఎద్దును ఢీకొనడంతో ముందు భాగం డ్యామేజ్ అయింది. ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయిందన్న సమాచారంతో సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. దెబ్బతిన్న పార్ట్‌లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేశారు. 20 నిమిషాల తర్వాత అక్కడి నుంచి బయలుదేరింది వందే భారత్ ఎక్స్‌ప్రెస్.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై గతంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడులకు దిగారు. అయితే ఈసారి అలాంటి ఘటన రిపీట్ కాకపోయినా ఓ ఎద్దు కారణంగా ట్రైన్ నిలిచిపోయింది. ఎద్దు ట్రాక్‌పైకి ఎందుకు వచ్చిందన్న దానిపై రైల్వే అధికారులు ఆరాతీస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
గత ఏడాది అక్టోబర్‌లో గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో వందేభారత్ రైలు గేదెలను ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇంజన్ ముందు భాగం ధ్వంసమైంది. రైలుకు అడ్డంగా వచ్చిన నాలుగు గేదెలు మృతి చెందాయి. మరుసటి రోజు ఆనంద్ స్టేషన్ సమీపంలో ఆవును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వందే భారత్ రైలు ఇంజన్ ముందు భాగం పాక్షికంగా ధ్వంసమైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



