AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: 3 ముళ్ల బంధంతో ఒక్కటైన అమెరికా అమ్మాయి-సింగరేణి అబ్బాయి..

దేశాలు వేరైనా… ప్రేమకు సరిహద్దులు లేవని మరోసారి నిరూపించింది ఓ ప్రేమజంట. మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రణీత్‌, అమెరికాకు చెందిన లవినశ్రీ (తమీ)తో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి అంగరంగ వైభవంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు ...

Naresh Gollana
| Edited By: |

Updated on: Feb 20, 2026 | 4:52 PM

Share

ప్రేమకు సరిహద్దులు లేవని మరోసారి నిరూపించింది ఓ ప్రేమ జంట. దేశాలు వేరైనా ప్రేమ విశ్వవ్యాప్తం అని చాటింది ఆ జంట. పెద్దలను ఒప్పించి మెప్పించి బందువుల‌ సమక్షంలో అంగరంగ వైభవంగా మూడు ముళ్లతో ఏడడుగులతో ఒక్కటయ్యారు. ఈ వేడుక సింగరేణి ఖిల్లా మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

మంచిర్యాల జిల్లా నస్పూర్‌‌కు చెందిన ప్రణీత్ అమెరికాలో సాప్ట్ వేర్ ఇంజనీర్.. అమెరికాకు చెందిన లవినశ్రీ (తమీ)తో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకుందామనుకున్నారు. అనుకున్నదే తడువుగా ఇరు కుటుంబాలను ఒప్పించారు. ఫిబ్రవరి 20న మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. ప్రణీత్ తండ్రి గంగిపల్లి రాములు సింగరేణి ఉద్యోగి కాగా.. ఇతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రణీత్ హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల సాక్షిగా, మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడిచి లవిన శ్రీని మనువాడాడు. ఈ పెళ్లి వేడుకకు‌ వచ్చి‌న బందువులంతా ఈ జంటను మనస్పూర్తిగా ఆశీర్వదించారు.

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..