Nirmala Sitharaman on Telangana Government : తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలతో మిగులు బడ్జెట్ కాస్తా.. లోటు బడ్జెట్‌గా మారిందంటూ వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో ఉన్న అనుమతిని మించి అప్పులు చేస్తున్నారంటూ నిర్మల పేర్కొన్నారు. చాలా అప్పులు అసెంబ్లీకి కూడా తెలియండం లేదని, ప్రభుత్వం చేస్తున్న అన్ని అప్పులనూ బడ్జెట్‌లో చూపించడం లేదంటూ ఆర్థికమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాల అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉందన్నారు. కేంద్రం ప్రశ్నిస్తే విమర్శిస్తున్నారు తప్ప సమాధానాల్లేవంటూ నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. కామారెడ్డి జిల్లాలో గురువారం జరిగిన ఒక సభలో పాల్గొన్న మంత్రి సీతారామన్ తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర పథకాలకు తెలంగాణ పేర్లు మార్చి వాడుకుంటోందని సాధారణ విమర్శలు మొదలు పెట్టిన నిర్మల.. రాను రాను తెలంగాణ అప్పులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అప్పులు FRBM పరిధి దాటి పోతోందని విమర్శించారు. తెలంగాణలో పుట్టబోయే పిల్లలపైనే తలకు లక్షా పాతికవేలు అప్పు ఉంటోందని తెలిపారు
రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని.. రైతు రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదన్నారు. కేసీఆర్ తీరుతో రైతులు అప్పులపాలయ్యారని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా భూములు లాక్కుంటున్నారని.. భూ నిర్వాసితులకు న్యాయం జరగడం లేదన్నారు. కేంద్రం ఇచ్చే పథకాల పేర్లు మార్చి ఇక్కడ అమలు చేస్తున్నారు. 8 ఏళ్లలో ఉపాధిహామీ పథకం కింద తెలంగాణకు రూ.20 వేల కోట్లు ఇచ్చామని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతిని కేంద్రం పెద్దలు ఎండగడుతూనే ఉన్నారు. లేటెస్ట్‌గా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం లక్షా 20వేల కోట్లు ఎలా పెంచారని ప్రశ్నించారు. పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ వెళ్లారు సీతారామన్. ఈ క్రమంలోనే ఈ కామెంట్లు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..