9 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనలో బంగారు తెలంగాణ సాకారం కాలేదని బంగారం కుటుంబం సాకారమైందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ 9 ఏళ్లలో రెండు రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధిపై టీవీ 9తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బడ్జెట్‌లో పెరుగుదల అనేది కేవలం తెలంగాణకే పరిమితంకాలేదు. దేశవ్యాప్తంగా వచ్చిన మార్పు. ఆంధ్రప్రదేశ్ మొదలు కేంద్ర బడ్జెట్ వరకు ఎక్కడ చూసినా ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం భారత జీడీపీ 7పై ఉంది. ద్రవ్యోల్బణం విషయంలో అమెరికా, యూకే, జర్మనీ కంటే మనమే తక్కువలో ఉన్నా’మన్నారు.
‘బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు వచ్చిన సాయంపై చర్చకు సిద్ధమా.? ఏ సెక్టార్ విషయంలో చూసుకున్నా కేంద్ర నుంచి తెలంగాణకు భారీగా నిధులు వచ్చాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెట్టుబడులు వస్తున్నాయి. పెట్టుబడులకు ఒకప్పుడు చైనా డెస్టినేషన్‌గా ఉండేది, కానీ ఇప్పుడు భారత్ మారింది. హైటెక్ సిటీలో బీఆర్‌ఎస్ మాఫియా పాలన నడుస్తోంది. ఫ్లెక్సీల విషయంలో కూడా బీఆర్‌ఎస్ నాయకులు వాటా అడుగుతున్నారు’ అంటూ ఓ రేంజ్‌లో విమర్శించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..