AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కొడుకు చేసిన పనిని జీర్ణించుకోలేక పోయిన తండ్రి.. రాత్రికి రాత్రి ఏం చేశాడంటే?

మెదక్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాదాసు శ్రీకాంత్(29) అనే యువకుడిని, తండ్రి మాదాసు దుర్గయ్య కత్తితో నరికి హత్య చేశారు. మద్యం మత్తులో నిద్రపోతున్న కొడుకును హతమార్చిన దుర్గయ్య, నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

Telangana: కొడుకు చేసిన పనిని జీర్ణించుకోలేక పోయిన తండ్రి.. రాత్రికి రాత్రి ఏం చేశాడంటే?
Medak Murder
P Shivteja
| Edited By: |

Updated on: Jan 17, 2025 | 11:55 AM

Share

కడవరకు కంటికి రెప్పలా చూసుకోవాల్సిన, తల్లిదండ్రులను కొంతమంది పిల్లలు నిత్యం వేధిస్తూ వారికి మనోవేధనను మిగులుస్తున్నారు. మద్యానికి బానిసై తల్లిదండ్రులపై దాడులకు సైతం తెగపడుతున్నారు. ఇలా మద్యానికి బానిసై నిత్యం తల్లిదండ్రులకు నరకం చూపిస్తున్న కొడుకుపై, విసిగివేసారిన ఓ తండ్రి కఠినంగా వ్యవహరించాడు. కొడుకు వేధింపులను తట్టుకోలేక అతన్ని చంపేసి, నేరుగా పోలీసు స్టేషన్ కి వెళ్లి, విషయం చెప్పి లొంగిపోయాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాదాసు శ్రీకాంత్(29) అనే యువకుడిని, తండ్రి మాదాసు దుర్గయ్య కత్తితో నరికి హత్య చేశారు. మాదాసు దుర్గయ్య కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కాగా టైలర్ పని చేసుకుని జీవనం సాగిస్తున్న దుర్గయ్య ఉన్న ఒక్క కూతురు వివాహం చేశారు. చిన్న కుమారుడైన శ్రీకాంత్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నారు.

అయితే గత పది సంవత్సరాలుగా శ్రీకాంత్ ఫుల్‌గా మద్యాని బానిస అయ్యాడు. ప్రతిరోజు మద్యం తాగి ఇంటికి రావడం.. తరుచు ఎదో ఒక రకంగా, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులతో గొడవ పడడంతో పాటు, వారిపై దాడికి తెగబడ్డాడు. కాగా సంక్రాంతి పండుగ నుండి ఇంట్లో గతం కంటే, ఎక్కువగా గొడవలు పడుతూ తల్లిదండ్రులపై తీవ్రస్థాయిలో దాడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గురువారం(జనవరి 16) రాత్రి కూడా శ్రీకాంత్, తన తండ్రి దుర్గయ్యతో గొడవపడి, చెప్పుతో తండ్రిపై దాడి చేశాడు.కన్న కొడుకు తనను చెప్పుతో కొట్టడాన్ని జీర్ణించుకోలేని దుర్గయ్య తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. రాత్రి మద్యం సేవించి పడుకున్న కుమారుడు శ్రీకాంత్‌పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, జరిగిన విషయం చెప్పి లొంగిపోయాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
షుగర్ పెరగకుండా ఉండాలంటే.. ఈ పానీయాలపై ఓ లుక్కేయండి!
షుగర్ పెరగకుండా ఉండాలంటే.. ఈ పానీయాలపై ఓ లుక్కేయండి!
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?