
నల్లగొండ జిల్లా కేతేపల్లికి చెందిన వీరబోయిన మహేష్ పత్తిని సాగు చేశాడు. తాను పండించిన పత్తిని అమ్మేందుకు ఈ నెల 8న ట్రాక్టర్‌లో లోడు చేసి అదే గ్రామానికి చెందిన ప్రదీప్‌రెడ్డి ఇంటి సమీపంలో పార్కింగ్ చేశాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి పత్తి లోడు ట్రాక్టర్ మాయమైంది. దీంతో మహేష్ కేతేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే కేతేపల్లి మండలం భీమారంకు చెందిన నూకల కోటేష్ ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ అలవాటుపడ్డాడు.
ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’
విలాసాల కోసం వ్యవసాయంతో వచ్చే ఆదాయం సరిపోక ఈజీ మనీ కోసం దొంగతనాలకు పాల్పడుతున్నాడు. 2019లో మాడుగులపల్లి, వేములపల్లి, కేతేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాక్టర్‌లు చోరీ చేసి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా కోటేష్‌లో మార్పు రాకపోగా మళ్లీ ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు. బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చేందుకు సూర్యాపేటకు చెందిన ఆడెపు సాయికుమార్‌తో కలిసి తిరిగి దొంగతనాలకు ప్లాన్ చేశాడు.
ఈ నెల 8వ తేదీ రాత్రి కేతేపల్లిలో వీరబోయిన మహేష్ పత్తి లోడు ట్రాక్టర్‌ను చోరీ చేశారు. ట్రాక్టర్‌లోని కొంత పత్తిని సూర్యాపేట మండలం బాలెంలోని కాటన్ మిల్లులో విక్రయించారు. ఇందుకు 72 వేల రూపాయలు వచ్చాయి. మిగిలిన పత్తిని కట్టంగూర్ మండలం అయిటిపాములలోని కాటన్ మిల్లుకు తరలిస్తున్నారు. ఇదే సమయంలో కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా, ట్రాక్టర్‌ను ఆపకుండా కోటేష్ అనుమానస్పదంగా కనిపించాడు. దీంతో కేతపల్లి పోలీసులు పట్టుకుని విచారించగా ఇద్దరు తమ నేరాన్ని అంగీకరించారని నల్లగొండ డి.ఎస్.పి శివరామిరెడ్డి తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి రూ.50వేల నగదు, ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారని అన్నారు.
ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..