Karimnagar Police Training College: మరో ట్రైనీ హెడ్ కానిస్టేబుల్ మృతి! 12 రోజుల్లో ఇద్దరు.. అసలేం జరుగుతోందక్కడ?
కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో వరుస మరణాలు సంచలనంగా మారాయి. అక్కడ శిక్షణ పొందుతున్న మరో హెడ్ కానిస్టేబుల్ తాజాగా మృతి చెందాడు. కేవలం 12 రోజుల వ్యవధిలో ఇది రెండో మరణం కావడంతో స్థానికంగా ఈ విషయం చర్చణీయంశంగా మారింది..
కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో వరుస మరణాలు సంచలనంగా మారాయి. అక్కడ శిక్షణ పొందుతున్న మరో హెడ్ కానిస్టేబుల్ తాజాగా మృతి చెందాడు. కేవలం 12 రోజుల వ్యవధిలో ఇది రెండో మరణం కావడంతో స్థానికంగా ఈ విషయం చర్చణీయంశంగా మారింది.
హైదరాబాద్‌కు చెందిన యుగంధర్‌కు ఇటీవల హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ వచ్చింది. దీంతో ఈ ఏడాది మే 22 నుంచి కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం (జూన్ 6) ఉదయం టిఫిన్ చేయడానికి వెళ్లిన సమయంలో యుగంధర్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ట్రైనింగ్ సెంటర్ సిబ్బంది వెంటనే అతన్ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యుగంధర్ మరణించిటన్లు పోలీసులు చెబుతున్నారు. హార్ట్ ఎటాక్‌తో మృతి చెందినట్లు తెలిపారు. ఐతే యుగంధర్ మృతి పట్ల కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న మనషి ఉన్నట్లుండి చనిపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. యుగంధర్ మృతి వెనుక అసలు కారణం తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా ఇదే ఏడాది మే 25న హైదరాబాద్‌కు చెందిన రాను సింగ్ (45) అనే మరో హెడ్ కానిస్టేబుల్ కూడా హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ పొందిన అతను శిక్షణ నిమిత్తం కొంతకాలం క్రితం కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు వచ్చాడు. ట్రైనింగ్ పొందుతున్న క్రమంలో రానూ సింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కాలేజ్ స్టాఫ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఈ ఘటన అనంతరం సరిగ్గా 12 రోజులకి మరో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందడంతో చర్చణీయాంశంగా మారింది. దీంతో అక్కడ ట్రైనింగ్ తీసుకుంటోన్న ఇతర అభ్యర్థులు అసలేం జరుగుతోందో తెలియక ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.