Telangana: చక్కెర అనుకుని విష గుళికలు తిన్న కవల పిల్లలు.. ఇద్దరి పరిస్థితి విషమం..!

పంటలకు ఉపయోగించే క్రిమిసంహారక మందులు, విష గుళికలు బహిరంగ ప్రదేశాలలో ఉంచవద్దని, ముఖ్యంగా ఇలాంటి చిన్న పిల్లలకు అందే విధంగా అందుబాటులో ఉంచవద్దని వైద్యులు సూచించారు.

Telangana: చక్కెర అనుకుని విష గుళికలు తిన్న కవల పిల్లలు.. ఇద్దరి పరిస్థితి విషమం..!
Mulugu Incident
Follow us
G Peddeesh Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Nov 29, 2024 | 10:29 AM

ములుగు జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. చక్కెర అనుకుని విష గుళికలు తిన్న ఇద్దరు కవలలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో జరిగింది. లక్ష్మణ్ అనే రైతు తన భార్యతో సహా పొలం పనులకు వెళ్ళారు. ఈ క్రమంలో తన కూతురు – కొడుకు కవలపిల్లలు జ్ఞానేశ్వర్ – జాహ్నవి ఇంటి పక్కన ఆడుకుంటూ వెళ్లి మిరప పంటకు పిచుకారి చేసే క్రిమి సంహారక గుళికలు సేవించారు. ఇద్దరు చిన్నారులు చక్కెర అనుకుని భ్రమపడి విష గుళికలు తిన్నారు. వారిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఏటూరునాగరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.

అయితే పంటలకు ఉపయోగించే క్రిమిసంహారక మందులు, విష గుళికలు బహిరంగ ప్రదేశాలలో ఉంచవద్దని, ముఖ్యంగా ఇలాంటి చిన్న పిల్లలకు అందే విధంగా అందుబాటులో ఉంచవద్దని వైద్యులు సూచించారు. ప్రస్తుతం ఇద్దరు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అదృష్టవశాత్తూ ఎక్కువ మొత్తంలో విష గుళికలు తీసుకోలేదు. కాబట్టి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..