AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cock Bus Ticket: కోడిపుంజు టికెట్ విషయంపై స్పందించిన సజ్జనార్.. వైరల్ కోసం ఓ వ్యక్తి ప్రోత్సాహంతోనే ఇలా చేశాడంటూ వివరణ..

Cock Bus Ticket: బస్సు ఎక్కిన ప్రాణమున్న ప్రతి జీవికి బస్ టికెట్(Bus Ticket) తీసుకోవాలంటూ తెలంగాణ ఆర్టీసి బస్సులో కోడిపుంజుకు టికెట్ తీసుకున్నాడు ఓ కండక్టర్. అది కూడా కోడి పుంజు(Cock)కు ఫుల్ టికెట్ కొట్టడంతో..

Cock Bus Ticket: కోడిపుంజు టికెట్ విషయంపై స్పందించిన సజ్జనార్.. వైరల్ కోసం ఓ వ్యక్తి ప్రోత్సాహంతోనే ఇలా చేశాడంటూ వివరణ..
Sajjanar
Surya Kala
|

Updated on: Feb 09, 2022 | 3:44 PM

Share

Cock Bus Ticket: బస్సు ఎక్కిన ప్రాణమున్న ప్రతి జీవికి బస్ టికెట్(Bus Ticket) తీసుకోవాలంటూ తెలంగాణ ఆర్టీసి బస్సులో కోడిపుంజుకు టికెట్ తీసుకున్నాడు ఓ కండక్టర్. అది కూడా కోడి పుంజు(Cock)కు ఫుల్ టికెట్ కొట్టడంతో ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అలా అలా ఈ టికెట్ విషయం టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వద్దకు చేరుకుంది. దీంతో సజ్జనార్ వెంటనే స్పందించారు. నిజానికి బస్సులో పక్షులు,కుక్కలు, పిల్లులు అంటే అసలు పశుపక్షాదులకు ప్రవేశం లేదని చెప్పారు. అయితే అలీ అనే వ్యక్తి రామగుండం సమీపంలో కోడిపుంజుతో కరీం నగర్ కు వెళ్తున్న పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుల్లో ఎక్కాడు. అయితే ఈ కోడిపుంజును బస్సు కండక్టర్ తిరుపతి సుల్తాన్​బాద్​ దగ్గర గుర్తించాడు. అప్పుడు కండక్టర్​ ఆ ప్రయాణికుడ్ని ప్రశ్నించాడు. అదే సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ న్యూస్ రిపోర్టర్ కోడిపుంజుకు కూడా టికెట్ తీసుకోమని పదే పదే చెప్పాడు.

హాట్​ న్యూస్​ కోసం ఆ రిపోర్టర్ పోత్సహించగా.. కండక్టర్​ ఆ ప్రభావంతో కోడిపుంజుకు టికెట్ కొట్టాడు. అయితే అప్పుడు ఆ రిపోర్టర్ మాటలను విని.. అలా టికెట్ తీసుకుని ఉండాల్సింది కాదు.. అయినప్పటికీ కోడిపుంజుకు ఫుల్ టికెట్ కొట్టిన కండక్టర్ పై చర్యలు తీసుకుంటామని సజ్జనార్ ఓ సోషల్ మీడియా వేదికగా తెలిజేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ వేదికగా సజ్జనార్ ప్రకటించారు.

కరీంనగర్‌కు వెళ్తోన్న బస్సులో అలీ అనే ప్రయాణికుడుమధ్యలో ఎక్కాడు. అయితే అలీ ఓ కోడిని సంచితో దాచిపెట్టుకుని ప్రయాణిస్తున్నాడు. బస్సు కుదుపులకు కోడిపుంజు అరవడంతో కండక్టర్ ఈ విషయాన్ని గమనించి నిలదీశాడు. పుంజుకు కూడా ప్జుల్ టికెట్ రూ. 30 లు తీసుకున్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

Also Read:  ఈ రకాల వ్యక్తులు పాములా విషపూరితమైనవారు.. కలలో కూడా నమ్మవద్దు అంటున్న చాణక్య ..