AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ ధరలపై ప్రత్యేక రాయితీ.. ఆ బస్సుల్లో 50 శాతం డిస్కౌంట్..

Telangana: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు సర్వీసుల్లో వెళ్లే సీనియర్ సిటీజన్లకు టికెట్ ధరలో 50 శాతం రాయితీ.. అలాగే హైదరాబాద్ నగరంలో టి-24 టికెట్‌ను కేవలం రూ.75లకే ఇవ్వాలని నిర్ణయించింది. పిల్లలకు అయితే టి-24 టికెట్‌ను రూ.50లకే ఇవ్వనుంది. అయితే ఈ నెల 15న అంటే స్వాతంత్య్ర దినోత్సవం రోజున మాత్రమే ఈ రాయితీలు ప్రయాణికులకు వర్తిస్తాయని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రస్తుతం సాధారణ ప్రయాణికులకు టి-24 టికెట్ రూ.120 ఉండగా.. మహిళలు, సీనియర్ సిటీజన్లకు రూ.100.. 12 ఏళ్లలోపు పిల్లలకు..

Telangana: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ ధరలపై ప్రత్యేక రాయితీ.. ఆ బస్సుల్లో 50 శాతం డిస్కౌంట్..
TSRTC-Bus
శివలీల గోపి తుల్వా
|

Updated on: Aug 13, 2023 | 8:27 PM

Share

తెలంగాణ, ఆగస్టు 13: భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తన ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. టీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లతో పాటు హైదరాబాద్ సిటీలోని సాధారణ ప్రయాణికులకు టికెట్‌లో భారీ రాయితీలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు సర్వీసుల్లో వెళ్లే సీనియర్ సిటీజన్లకు టికెట్ ధరలో 50 శాతం రాయితీ.. అలాగే హైదరాబాద్ నగరంలో టి-24 టికెట్‌ను కేవలం రూ.75లకే ఇవ్వాలని నిర్ణయించింది. పిల్లలకు అయితే టి-24 టికెట్‌ను రూ.50లకే ఇవ్వనుంది. అయితే ఈ నెల 15న అంటే స్వాతంత్య్ర దినోత్సవం రోజున మాత్రమే ఈ రాయితీలు ప్రయాణికులకు వర్తిస్తాయని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.

ప్రస్తుతం సాధారణ ప్రయాణికులకు టి-24 టికెట్ రూ.120 ఉండగా.. మహిళలు, సీనియర్ సిటీజన్లకు రూ.100.. 12 ఏళ్లలోపు పిల్లలకు రూ.80 గా ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో టి-24 టికెట్‌ను ప్రయాణికులందరికీ రూ.75కే సంస్థ ఇవ్వనుండగా.. పిల్లలకు రూ.50లకి ఇస్తోంది. రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో 60 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటీజన్లకు ఒక్క రోజు టికెట్‌లో 50 శాతం రాయితీని కల్పిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ మేరకు ‘ఆగస్టు 15 భారతీయులందరికీ పండుగ రోజు. మన దేశ చరిత్రలో అదొక మైలురాయి. వేల మంది అమరవీరుల త్యాగం ఫలితంగా భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించిన ఆ శుభ దినాన ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. పల్లె వెలుగు బస్సుల్లో వెళ్లే సీనియర్ సిటీజన్లకు టికెట్ లో 50 శాతం రాయితీ ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. 60 ఏళ్లు దాటిన స్త్రీ, పురుష సీనియర్ సిటీజన్లకు ఈ రాయితీ వర్తిస్తుంది. వారు ప్రయాణ సమయంలో వయసు ధ్రువీకరణ కోసం బస్ కండక్టర్ కి తమ ఆధార్ కార్డును చూపించాలి. అలాగే, స్వాతంత్ర్య దినోత్సవం నాడు హైదరాబాద్ సిటీలో ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. పెద్ద ఎత్తున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఆ రోజున పర్యాటక ప్రాంతాలు, పార్కులకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టి-24 టికెట్ పై భారీ రాయితీని సంస్థ ప్రకటించింది. ఆ టికెట్ ను పెద్దలకు రూ.75కి, పిల్లలకు రూ.50కి అందజేస్తోంది. ఈ నెల 15న ఒక్కరోజు మాత్రమే ఈ రాయితీలు అందుబాటులో ఉంటాయి. ఈ రాయితీలను ఉపయోగించుకుని స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా’మని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ రాయితీలకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని వారు సూచించారు.

Follow Us
రతన్ టాటా చెప్పిన ECG ఫార్ములా..ఇది తెలిస్తే మీరు ఓటమికి భయపడరు..
రతన్ టాటా చెప్పిన ECG ఫార్ములా..ఇది తెలిస్తే మీరు ఓటమికి భయపడరు..
వర్షాకాలం వచ్చిందని క్లీనింగ్ పనులు స్టార్ట్ చేశారు.. మ్యాన్‌హోల్
వర్షాకాలం వచ్చిందని క్లీనింగ్ పనులు స్టార్ట్ చేశారు.. మ్యాన్‌హోల్
తప్పు కాదు పెద్ద పొరపాటే.. ఈ 4 ప్రదేశాల్లో వెనకకు చూస్తే మహా పాపం
తప్పు కాదు పెద్ద పొరపాటే.. ఈ 4 ప్రదేశాల్లో వెనకకు చూస్తే మహా పాపం
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? BSNLలో భారీ అవకాశం
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? BSNLలో భారీ అవకాశం
కుళ్లిన మాంసం అమ్మేస్తున్నారు.. నాన్‌-వెజ్‌ ప్రియులారా జాగ్రత్త
కుళ్లిన మాంసం అమ్మేస్తున్నారు.. నాన్‌-వెజ్‌ ప్రియులారా జాగ్రత్త
శివలింగాన్ని ఇంట్లో ఇలా ప్రతిష్ఠిస్తే శాంతి, ఐశ్వర్యం కలుగుతాయట!
శివలింగాన్ని ఇంట్లో ఇలా ప్రతిష్ఠిస్తే శాంతి, ఐశ్వర్యం కలుగుతాయట!
'టాప్కోస్'ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్ 
'టాప్కోస్'ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్ 
ప్రపంచకప్‌లో విశ్వరూపం చూపించబోతున్న భారతీయులు
ప్రపంచకప్‌లో విశ్వరూపం చూపించబోతున్న భారతీయులు
భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది
భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది
చికెన్ వండిన తర్వాత ముక్కలు గట్టిగా మారుతున్నాయా?
చికెన్ వండిన తర్వాత ముక్కలు గట్టిగా మారుతున్నాయా?