తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి హరీష్ రావు!

తెలంగాణ మంత్రి హరీష్ రావు మార్చి 8న అసెంబ్లీలో తొలిసారి టీఎస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారట. మార్చి 6వ తేదీ నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా..

తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి హరీష్ రావు!
Follow us

| Edited By:

Updated on: Mar 01, 2020 | 3:26 PM

ఈ నెల మార్చి 6వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈ సందర్భంగా గవర్నర్ తొలిసారిగా సభలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. కాగా.. సీఎం కేసీఆర్ ఒకట్రెండు కొత్త పథకాలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మంత్రి గంగుల కమలాకర్ కూడా ఇటీవల దీనికి సంబంధించి హింట్ ఇచ్చారు. అలాగే బడ్జెట్‌ నేపథ్యంలో.. వివిధ విషయాలపై అధికారులతో కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ బడ్జెట్ నేపథ్యంలో ఒక వార్త వైరల్ అవుతోంది. తెలంగాణ మంత్రి హరీష్ రావు మార్చి 8న అసెంబ్లీలో తొలిసారిగా టీఎస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారట. మార్చి 6వ తేదీ నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఆ రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈసారి బడ్జెట్‌లో ఎలాంటి కొత్త పథకాలు, రాయితీలు ఉంటాయనే చర్చ నడుస్తుండగా.. హరీష్ రావు మార్క్ ఉంటుందా అనే దానిపై చర్చ నడుస్తోంది. కాగా గతేడాది సీఎం కేసీఆర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం తెలిసిందే.