పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఊహించని విషాదం.. చిన్నారి మృతి..

వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బంది నిర్లక్ష్యం ఓ చిన్నారిని బలితీసుకుంది. ఓ ఇల్లాలుకి కడుపుకోత మిగిల్చింది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా హడావుడి పనులు చేస్తున్న అధికారులు.. హన్మకొండలోని కొత్తూరు జెండా ప్రాంతంలో కాల్వల విస్తరణ చేపట్టారు. జేసీబీ ద్వారా కాలువ మట్టి తీస్తుండగా పక్కనే ఉన్న గోడ కుప్పకూలింది.

పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఊహించని విషాదం.. చిన్నారి మృతి..
Follow us

|

Updated on: Mar 01, 2020 | 4:49 PM

వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బంది నిర్లక్ష్యం ఓ చిన్నారిని బలితీసుకుంది. ఓ ఇల్లాలుకి కడుపుకోత మిగిల్చింది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా హడావుడి పనులు చేస్తున్న అధికారులు.. హన్మకొండలోని కొత్తూరు జెండా ప్రాంతంలో కాల్వల విస్తరణ చేపట్టారు. జేసీబీ ద్వారా కాలువ మట్టి తీస్తుండగా పక్కనే ఉన్న గోడ కుప్పకూలింది. ఆ పక్కనే ఆడుకుంటున్న చిన్నారిపై పడింది. ఈ ప్రమాదంలో ప్రిన్సీ అనే చిన్నారి స్పాట్‌లోనే చనిపోయింది. మరో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.

గాయాలపాలైన బాలుడుని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ దిగ్ర్బాంతికి గురయ్యారు. వెంటనే ఎంజీఎంకు చేరుకున్న వినయ్‌ భాస్కర్‌.. డెడ్‌బాడీకి పోస్టు మార్టం పూర్తి చేయించారు. తల్లిదండ్రుల స్వగ్రామం గోవిందరావుపేటకు మృతదేహాన్ని దగ్గరుండి తరలించారు.

ఈ ఘటనను వెంటనే సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు వినయ్‌భాస్కర్‌. దిగ్ర్బాంతికి గురైన కేసీఆర్‌ తక్షణమే చిన్నారి కుటుంబానికి 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరుపున బాలిక తల్లి ధనలక్ష్మికి ఉద్యోగం ఇప్పించి.. నివాస వసతి కల్పిస్తామని వినయ్‌భాస్కర్‌ హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి : మారుతీరావు షెడ్‌లో మృతదేహం కేసులో మరో ట్విస్ట్…ఆయిల్ చల్లి..