ఫెయిల్ అయితే సూసైడ్ వద్దు.. సైకాలజిస్టుల ఫోన్ నెంబర్లు ఇవే!

తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. టీఎస్ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఒకేసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఈ ఏడాది విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 60.1 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్‌లో 68.86 శాతం మంది...

ఫెయిల్ అయితే సూసైడ్ వద్దు.. సైకాలజిస్టుల ఫోన్ నెంబర్లు ఇవే!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 18, 2020 | 5:15 PM

TS Inter Results 2020: తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. టీఎస్ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఒకేసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఈ ఏడాది విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 60.1 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్‌లో 68.86 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 9,65,839 మంది పరీక్షలు రాశారు. వీరిలో సెకండ్ ఇయర్ విద్యార్థులు 4,85,323 మంది ఉండగా, సెకండ్ ఇయర్ విద్యార్థులు 4,80,516 మంది ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ.. రిజల్ట్స్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఇంటర్ పరీక్షా ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారని పేర్కొన్నారు. అలాగే సప్లిమెంటరీ పరీక్షల తేదీని త్వరలోనే వెల్లడిస్తామన్నారు మంత్రి సబిత.

అలాగే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఒత్తిడితో ఏమైనా అఘాయిత్యాలు చేసుకుంటారేమోననే ముందస్తు జాగ్రత్తతో తెలంగాణ సర్కార్ కొందరు క్లీనికల్ సైకాలజిస్టుల సేవలను వినియోగించుకోవాలని సూచించింది. దీంతో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏడుగురు సైకాలిజిస్టుల ఫోన్‌ నెంబర్లను కూడా అందజేసింది. ఎవరైనా విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనతో ఉంటే వెంటనే సైకాలిజిస్టులను సంప్రదించాలని తెలిపింది.

Read More: 

30 యాప్స్‌ని తొలగించిన గూగుల్.. మీరూ తొలగించండి..

అందుకే బాలీవుడ్‌కి దూరమయ్యా.. సీనియర్ నటి రమ్యకృష్ణ వ్యాఖ్యలు