Telangana: రణతంత్రంగా మారిన గణతంత్ర వేడుకలు.. రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ పరోక్ష విమర్శలు.. అధికార పార్టీ నేతల చురకలు..

|

Jan 26, 2023 | 4:50 PM

తెలంగాణ రాష్ట్రంలో గణతంత్ర వేడుకలు కాస్తా రణతంత్రంగా మారిపోతోంది. రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ విషయం ఇప్పటికే పొలిటికల్‌గా హీట్ పెంచింది. కావాల్సినంత కాంట్రవర్సీ కూడా..

Telangana: రణతంత్రంగా మారిన గణతంత్ర వేడుకలు.. రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ పరోక్ష విమర్శలు.. అధికార పార్టీ నేతల చురకలు..
Telangana Governor Tamili Sai; Cm Kcr
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో గణతంత్ర వేడుకలు కాస్తా రణతంత్రంగా మారిపోతోంది. రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ విషయం ఇప్పటికే పొలిటికల్‌గా హీట్ పెంచింది. కావాల్సినంత కాంట్రవర్సీ కూడా క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం వ్యక్తిగత విమర్శల దిశగా మళ్లుతోంది. ఈ రోజు(జనవరి 26) గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజ్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆమె తన స్పీచ్‌లో పరోక్షంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. వీటికి బీఆర్ఎస్ నేతలు కూడా కౌంటర్లు ఇవ్వడం ప్రారంభించడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు ముగిసిన తర్వాత పుదుచ్చేరిలోనూ రిపబ్లిక్ డే కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై.. అక్కడా ఇదే పంథాను కొనసాగించి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు గుప్పించారు.

తమిళిసై ఏమన్నారంటే..

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మాట్లాడిన తమిళిసై ‘కొందరికి నేను నచ్చకపోవచ్చు.. కానీ తెలంగాణ అంటే ఇష్టం. ఎంతకష్టమైనా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తా. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ అభివృద్ధిలో నా పాత్ర తప్పక ఉంటుంది. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం. కొందరికి ఫార్మ్‌హౌస్‌లు కాదు.. అందరికీ ఫార్మ్‌లు కావాలి. తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి.. తెలంగాణలో రోజుకు 22 ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తెలంగాణ యువత ధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా.ఎందరో వీరుల త్యాగ ఫలితం మన స్వాతంత్య్రం. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది.. నిజమైన ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం దిక్సూచి. అభివృద్ధి అంటే భవనాల నిర్మాణం కాదు. అభివృద్ధి అంటే జాతి నిర్మాణం. కొందరికి ఫామ్‌హౌస్‌లు ఉండటం అభివృద్ధి కాదు.. ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఉండటం అభివృద్ధి’ అంటూ సీఎం కేసీఆర్‌ను పరోక్షంగా విమర్శించారు.

ఇవి కూడా చదవండి

అధికార పార్టీ నేతల కౌంటర్లు..

సీఎం కేసీఆర్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై చేసిన పరోక్ష విమర్శలను పట్టుకొని స్ట్రైట్ కౌంటర్లు వేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ‘ఫామ్‌హౌస్‌లు ఉండటమే నేరమైతే 2019 మీరు కొనుగోలు చేసిన ఫామ్‌హౌస్ సంగతేంట’ని తమిళిసైని ప్రశ్నిస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఇదే క్రమంలో తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా మంగడు గ్రామంలో గవర్నర్‌ తమిళిసైకి ఫామ్‌హౌస్‌ ఉందని ఆరోపించారు BRS నేత క్రిశాంక్. అంతే సర్వేనంబర్లను.. ఆ డాక్యుమెంట్ కాపీని కూడా తన ట్వీట్‌కు జత చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..