TS EAMCET 2023: నేటి నుంచే తెలంగాణ ఎంసెట్ పరీక్షలు.. ఎగ్జామ్స్ షెడ్యూల్, రూల్స్ వివరాలివే..

|

May 10, 2023 | 9:56 AM

TS EAMCET: JNTU హైదరాబాద్ నిర్విహిస్తున్న తెలంగాణ ఎంసెట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలు మే 10, 11 తేదీల్లో.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 12, 13, 14 డేట్స్‌లో జరగనున్నాయి. ఇంకా ఎంసెట్..

TS EAMCET 2023: నేటి నుంచే తెలంగాణ ఎంసెట్ పరీక్షలు.. ఎగ్జామ్స్ షెడ్యూల్, రూల్స్ వివరాలివే..
TS EAMCET 2023
Follow us on

TS EAMCET: JNTU హైదరాబాద్ నిర్విహిస్తున్న తెలంగాణ ఎంసెట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలు మే 10, 11 తేదీల్లో.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 12, 13, 14 డేట్స్‌లో జరగనున్నాయి. ఇంకా ఎంసెట్ పరీక్షల కోసం దాదాపు 3.20 లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షల కోసం మొత్తం లక్షకు పైగా విద్యార్థులు, అలాగే ఇంజినీరింగ్ పరీక్షలకు దాదాపు 2 లక్షల మంది స్టూడెంట్స్ హాజరుకానున్నారు.

కాగా, తెలంగాణ ఎంసెట్ పరీక్షలు రాష్ట్రంలోని 104 కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్‌లోని 33 కేంద్రాలలో జరిగేలా అధికారులు ఏర్పాటు చేశారు. గతంలో కంటే కొత్తగా 28 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ఎంసెట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరగనున్నాయి.

 రూల్స్‌ ఇవే..

ఇవి కూడా చదవండి
  1. తెలంగాణ ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ ఒరిజినల్ తమ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీకి సంబంధించిన ఏదైనా ఒరిజినల్ కార్డ్‌ని తీసుకెళ్లాలి. జిరాక్స్‌లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని అధికారులు తెలిపారు.
  2. అదే సమయంలో ఈ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. గంటన్నర ముందుగా పరీక్షా కేంద్రాలకు తప్పనిసిరగా రావాలని సూచించారు.
  3. పరీక్ష రాసే విద్యార్థుల బయోమెట్రిక్‌లు చేయనున్నారు. అందువల్ల చేతులపై గోరింటాకు, ఇతర డిజైన్‌లు చేతిలో ఉంటే బయోమెట్రిక్‌ వేసేందుకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
  4. విద్యార్థులు కాలిక్యులేటర్లు, మ్యాథ్స్, లాగ్ టేబుల్స్, స్మార్ట్ ఫోన్లు, రిస్ట్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష హాలులోకి అనుమతించబోమని అధికారులు ముందుగానే తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..