Telangana: ఆల్ టైం రికార్డ్! తెలంగాణలో ఎన్ని కోట్ల బీర్లు తాగారో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!

|

Jun 01, 2023 | 5:19 AM

విందులు.. వినోదాలు.. పుట్టినరోజులు.. వేదిక ఏదైనా ముక్క ఉండాల్సిందే.. చుక్క పడాల్సిందే...! దీనికి తోడు వేసవిలో భానుడు మంటలు పుట్టిస్తున్నాడు. ఇంకేముంది చిల్డ్ బీరేసి చిందెయ్‌రా అంటున్నారు తెలంగాణ మందుబాబులు. రికార్డు బద్దలయ్యేలా బాటిల్ మీద బాటిల్‌ ఎత్తి తెగ లాగించేస్తున్నారు.

Telangana: ఆల్ టైం రికార్డ్! తెలంగాణలో ఎన్ని కోట్ల బీర్లు తాగారో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!
Follow us on

విందులు.. వినోదాలు.. పుట్టినరోజులు.. వేదిక ఏదైనా ముక్క ఉండాల్సిందే.. చుక్క పడాల్సిందే…! దీనికి తోడు వేసవిలో భానుడు మంటలు పుట్టిస్తున్నాడు. ఇంకేముంది చిల్డ్ బీరేసి చిందెయ్‌రా అంటున్నారు తెలంగాణ మందుబాబులు. రికార్డు బద్దలయ్యేలా బాటిల్ మీద బాటిల్‌ ఎత్తి తెగ లాగించేస్తున్నారు. చురు‌క్కు‌మ‌ని‌పి‌స్తున్న ఎండల్లో చిల్డ్‌ బీరును ఎంజాయ్‌ చేస్తు‌న్నారు మద్యం ప్రియులు. ఎండల తీవ్రత మరింత పెర‌గ‌డంతో మందు బాటిల్‌ పక్కన పెట్టి.. బీరు సీసా ఎత్తు‌తు‌న్నారు. విస్కీ, బ్రాంది తదితర అలవాటున్న వారు సైతం ఎండల ప్రతాపంతో వాటిని త్రాగకుండా బీరు వైపు చూస్తున్నారు. రికార్డ్ స్థాయిలో పెరిగిపోతున్న బీర్ సేల్సే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం.

నెల రోజుల్లో 7.44 కోట్ల బీర్ల అమ్మకాలు..

తెలంగాణలో బీర్లు పొంగిపొర్లుతున్నాయి. మద్యం ప్రియులు బాటిల్ మీద బాటిల్‌ ఎత్తి తెగ లాగించేస్తున్నారు. ఎండలు పెరిగితే మనకేంటి.. చిల్డ్ బీరేసి చిందెయ్‌రా.. అంటున్నారు తెలంగాణ మందుబాబులు. దీంతో బీర్ సేల్స్ ఆల్ టైం రికార్డును బద్ధలు కొట్టాయి. నెల రోజుల్లో 7 కోట్ల 44 లక్షల బీర్లు అమ్ముడు పోయాయి. ఈ రికార్డు బద్ధలు కొట్టింది తెలంగాణ మందుబాబులే.

రోజుకు 24 లక్షల బీర్లు..

మే నెల మొత్తం సూర్రీడు సుర్రుమంటుంటే మందుబాబులు మాత్రం రిలాక్స్ అవ్వడానికి ఛిల్ బీరునే ఎంచుకోవడంతో ఈ 31 రోజుల్లో బీర్ కి ఫుల్ గిరాకీ పెరిగింది. రోజుకు 24 లక్షల బీర్ల చొప్పున అమ్ముడు పోయాయి. గతంలో హయ్యస్ట్ బీర్ సేల్స్ అంటే అది 2019.. ఆ సంవత్సరం మే నెలలో 60 లక్షల బీర్ కేసుల అమ్మకం జరిగింది. ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి మరీ బీర్ సేల్స్ జరిగాయి. ఎండాకాలంలో బీర్ సేల్స్ పెరగటం కామన్.. అయితే 2023 సంవత్సరం మాత్రం విపరీతమైన అమ్మకాలు సాగి.. రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇవి కూడా చదవండి

రెగ్యులర్‌గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా 28 నుంచి 30 లక్షల కేసుల బీర్లు అమ్ముడవుతాయి. ఎండాకాలంలో బాగా పెరగటం సహజం.. ఈసారి మాత్రం రోజుకు 24 లక్షల బీర్ల చొప్పు.. 31 రోజుల్లోనే 7 కోట్ల 44 లక్షల బీర్లు అమ్ముడు కావటం సంచలనంగా మారింది. ప్రభుత్వానికి సైతం వేల కోట్ల ఆదాయం వచ్చింది. లీటర్ల లెక్కలో తీసుకుంటే.. చిన్నా, పెద్ద బీర్లు అన్నీ కలుపుకుంటే.. యావరేజ్ గా 4 కోట్ల లీటర్లపైనే బీరు తాగేశారు తెలంగాణ మందు ప్రియులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..