ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎత్తివేత వారి పాపమే.. డోర్నకల్‌ త్వరలో జూనియర్‌ కళాశాల

కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకవచ్చిన నూతన వ్యవసాయ చట్టాల కారణంగానే కొనుగోలు కేంద్రాలను విరమించుకోవాల్సి వచ్చిందని..

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎత్తివేత వారి పాపమే.. డోర్నకల్‌ త్వరలో జూనియర్‌ కళాశాల
Follow us

|

Updated on: Jan 21, 2021 | 7:19 AM

కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకవచ్చిన నూతన వ్యవసాయ చట్టాల కారణంగానే కొనుగోలు కేంద్రాలను విరమించుకోవాల్సి వచ్చిందని టీఆర్‌ఎస్‌ ఎంపి మాలోతు కవిత విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపి మాలోతు కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ అర్హులైన లబ్దిదారులకు రెండు పడక గదుల ఇళ్లు, పింఛన్లు, యువతకు నిరుద్యోగ భృతి కల్పించాలని ఇటీవల మంత్రి కేటీఆర్‌ను కలిసి కోరామని ఎంపీ కవతి తెలిపారు.

డోర్నకల్-గార్ల రైల్వే స్టేషన్ల మధ్య ఆర్‌‌యుబి, ఆర్ఓబి మంజూరయ్యాయని ప్రస్తుతం టెండర్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. డోర్నకల్ పట్టణంలో త్వరలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయానున్నామని తెలిపారు. తిరుపతి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం పద్మావతి ఎక్స్ ప్రెస్ రైలు‌ను డోర్నకల్‌లో హాల్టింగ్ కల్పించాలని రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు ఎంపి తెలిపారు.