
నందు.. నందు.. నందూ.. ఎవరీ నందూ.. ఎవరివాడీ నందూ.. ఫాం హౌజ్ సీక్రెట్స్ బ్లో అవుట్ కాగానే.. ఒక్కసారిగా ముగ్గురు కొత్త వ్యక్తులు సీన్లోకి వచ్చారు. అందులో అందరికన్నా ఎక్కువగా ఎలివేట్ అవుతున్న పేరు నందు.. నంద కుమార్. ఈ ఇష్యూ బయట పడగానే ఒక్కసారిగా టీఆర్ఎస్ నేతలంతా బీజేపీ నేతలకు నందుకు ఉన్న సంబంధాలు గురించి అటు సోషల్ మీడియాలో.. ఇటు మెయిన్ మీడియాలో పదే పదే చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా.. మరి కొంత మంది బీజేపీ నేతలతో ఆయన కలిసి ఉన్న ఫోటోలను రిలీజ్ చేసి.. మొత్తం ఎపిసోడ్‌కి కర్త.. కర్మ.. క్రియ.. బీజేపీ అనడానికి ఇదుగో ఈ ఫోటోలే సాక్ష్యం అంటూ పదే పదే చెప్పుకొచ్చారు.
దీంతో ఒక్కసారిగా నందూ ఈ ఎపిసోడ్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారు. బీజేపీ నేతలతో కలిసి ఉన్న ఫోటోలు రిలిజ్ అయ్యేసరికి .. మరీ ముఖ్యంగా కిషన్ రెడ్డి ఫోటోలు వచ్చేసరికి.. ఆయనకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. కిషన్ రెడ్డి బుధవారం రాత్రే క్లియర్ కట్‌గా చెప్పేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పని చేసిన.. పని చేస్తున్న తనను జంట నగరాల్లో చాలా మంది కలుస్తుంటారని.. ఫోటోలు దిగుతుంటారని.. అంత మాత్రాన తనకు వారికి సంబంధమేంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ హడావుడి నడుస్తుండగానే గురువారం మార్నింగ్ ఈ నందూ ఎపిసోడ్.. న్యూ టర్న్ తీసుకుంది. ఈ నందూ ఒక్క బీజేపీ వాడే కాదని.. అందరి వాడూ అంటూ.. టీఆర్ఎస్ నేతలతో కలిసి ఉన్న ఫోటోలను బీజేపీ రిలీజ్ చేసింది. అది కూడా ఒకరిద్దరితో కాదు.. చాలా మంది టీఆర్ఎస్ కీలక నేతలతో నందూ కలిసి ఉన్న ఫోటోలు.. నందూ గులాబీ రంగు చొక్కా వేసుకొని గులాబీ నేతలతో ఉన్న పోటోలను కూడా బీజేపీ రిలీజ్ చేసి.. ఇప్పుడు చెప్పండి.. ఎవరివాడీ నందూ.. ఎక్కడి వాడీ నందూ.. అంటూ రివర్స్ ఎటాక్ చేసింది. మీడియా సాక్షిగా ప్రముఖ టీఆర్ఎస్ నేతలతో నందూ కలిసి ఉన్న ఫోటోలను రిలీజ్ చేసి… కొత్త ప్రశ్నలు రైజ్ చేసింది.
మొత్తంగా ఈ ఫాంహౌజ్ సీక్రెట్స్ ఎపిసోడ్ మొత్తం నందూ కేంద్రంగా నడుస్తోంది. మరో ఇద్దరు ఇందులో నిందితులుగా ఉన్నప్పటికీ వాళ్లిద్దరూ నాన్ లోకల్ వ్యక్తులు కావచ్చు లేదా.. నందూతో పోల్చితే నేతలు వాళ్లకు మధ్య ఉన్న సంబంధాలు కావచ్చు.. వాళ్లు మాత్రం ప్రస్తుతానికి నందూ వెనకే ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..