AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సినిమావాళ్లతో కూడా టికెట్ల యాపారం.. అయ్యగారి గురించి వెలుగులోకి సంచలన విషయాలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫామ్‌హౌస్‌ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లతో రచ్చరచ్చగా మారింది.

Telangana: సినిమావాళ్లతో కూడా టికెట్ల యాపారం.. అయ్యగారి గురించి వెలుగులోకి సంచలన విషయాలు
Simhayaji Swamy With Cine Celebraties
Ram Naramaneni
|

Updated on: Oct 27, 2022 | 5:57 PM

Share

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం తెరపైకి వచ్చింది. ఫాం హౌస్‌ వేదికగా జరిగిన బిగ్‌ డీల్‌ వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీ దాకా వణుకు పుట్టిస్తోంది. కాగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ఫాంహౌస్‌కి వచ్చిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీకి చెందిన సతీశ్‌ శర్మ అలియాస్‌ రామచంద్ర భారతి(ఏ1), హైదరాబాద్‌కు చెందిన నందకిశోర్‌(ఏ2), తిరుపతికి చెందిన సింహయాజి (ఏ3)గా FIRలొ చేర్చారు. ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలను పొందుపర్చారు. బీజేపీలో చేరితే 100కోట్లు ఇప్పిస్తామని సతీష్‌శర్మ అలియాస్‌ రామచంద్రభారతి ఆఫర్ చేశారని.. నందకిశోర్‌ మధ్యవర్తిత్వంతో ఫామ్‌హౌస్‌కు సతీష్‌ శర్మ, సింహయాజి వచ్చారని FIRలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే  మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో మళ్లీ సోదాలు చేశారు పోలీసులు. పక్కాగా టెక్నికల్‌ ఎవిడెన్స్‌ సేకరించేందుకు తనిఖీలు నిర్వహించారు. డీసీపీ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు కొనసాగింది.

కాగా మొయినాబాద్ అజిజ్ నగర్‌లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌లో కీలకంగా మారన సింహయాజి స్వామీజీ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈయన తిరుపతికి చెందిన వ్యక్తిగా పోలీసులు FIRలో పొందుపరిచారు. తిరుపతికి చెందిన అన్నమాచార్య వంశస్థుడిని అని స్వామీజీ తనకు తానే పలువురికి పరిచయం చేసుకున్నారు. 5 నెలల క్రితమే ఈయన హైదరాబాద్‌‌లో మకాం వేశారు. జూన్ 23న బషీర్‌బాగ్ హోటల్‌లో పలువురు సినిమా నటీనటులతో భేటీ అయ్యారు ఈ స్వామీజీ. ‘మా’ అసోసియేషన్ ఈసీ మెంబెర్ శ్రీనివాస్ ఈ మీటింగ్ అరెంజ్ చేశారు. మీడియేటర్‌గా 24 క్రాఫ్ట్స్‌ లీడర్‌ గోవింద్‌ వ్యవహరించారు.  కరాటే కళ్యాణి, రాజేశ్వరి, పూజిత, మలక్‌పేట్ శైలజ సహా పలువరు ఈ భేటీలో పాల్గొన్నారు,

డేట్ ఫిక్స్ చేస్తే.. అందర్నీ ఢిల్లీ తీసుకెళ్లి అమిత్ షా, జేపీ నడ్డాలను కల్పిస్తానని ఆయన సినిమావాళ్లకు హామి ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు.. ఎమ్మెల్యే సీట్లు, కాంట్రాక్టులు ఇప్పిస్తామంటూ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఎన్నికలకు డబ్బులు ఎలా అంటూ సినిమా ఆర్టిస్టులు ప్రశ్నించగా.. బీజేపీలో జాయిన్ అయితే డబ్బులు అవే వస్తాయి అంటూ స్వామీజీ బీరాలు పలికినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..