Rahul Gandhi: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ అంశంపై స్పందించారు. ఈమేరకు ధాన్యం కొనుగోలు అంశంపై మంగళవారం తెలుగులో ట్వీట్ చేశారు. ‘తెలంగాణలో పండిన చివరి గింజ కొనే వరకూ, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుంది. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారాయన.
ట్విట్టర్‌లో కాదు.. పార్లమెంట్‌లో..
ఇలా రాహుల్ ట్వీట్ చేశారో లేదో టీఆర్‌ఎస్ నేతలు స్పందించడం మొదలుపెట్టారు. మొదట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాహుల్‌కు కౌంటర్ ఇచ్చారు.. ‘రాహుల్ గాంధీ.. మీరు ఎంపీగా ఉన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం నామమాత్రంగా ట్విట్టర్ లో సంఘీభావం తెలపడం కాదు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని పార్లమెంట్ వెల్‌లోకి వెళ్లి టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన తెలియజేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్ లోకి వచ్చి నిరసన తెలియజేయండి. ఒకే దేశం – ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయండి’ అని కవిత డిమాండ్ చేశారు.
.@RahulGandhi గారు మీరు ఎంపీగా ఉన్నారు, రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలుపడం కాదు.
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని @trspartyonline ఎంపీలు ప్రతిరోజు పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి 1/2 https://t.co/BTMd0GwKPe— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 29, 2022
మొసలి కన్నీళ్లు ఆపండి..
ఆ తర్వాత కొద్ది సేపటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కూడా రాహుల్‌కు కౌంటరిచ్చారు. ట్విట్టర్ వేదికగా ‘రాహుల్.. తెలంగాణ పై దొంగ ప్రేమ, మొసలి కన్నీళ్లు ఆపు. తెలంగాణ ప్రజల మేలు కోరుకునేవాళ్లే అయితే పార్లమెంట్ లో మా ఎంపిలతో కలిసి ఆందోళన చేయండి. రైతుల ఉసురుపోసుకుంటోన్న కేంద్రం తీరును ఎండగట్టే పని చేయండి’ అని రాహుల్‌కు సూచించారు.
తెలంగాణ పై దొంగ ప్రేమ, మొసలి కన్నీల్లు ఆపండి రాహుల్ గాంధీ గారు..
తెలంగాణ ప్రజల మేలు కోరుకునేవాళ్లే అయితే పార్లమెంట్ లో మా ఎంపిలతో కలిసి మీరు ఆందోళన చేయండి
రైతుల ఉసురుపోసుకుంటోన్న కేంద్రం తీరును ఎండగట్టే పని చేయండి. https://t.co/ie53QrrW1m— Harish Rao Thanneeru (@trsharish) March 29, 2022
Also Read:Viral Video: అమ్మో..! ఇదేం పిల్లి రా.. బాబు అదరిపోయే వంటలు చేస్తోంది.. గుటకలేస్తున్న జనం..
Russian Soldiers: నా కొడుకు ముందే రష్యా సైనికులు అత్యాచారం చేశారు.. ఉక్రెయిన్ మహిళ ఆరోపణ
KGF2 : కేజీఎఫ్ స్టార్లకు కోట్లలో రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే షాకవుతారు..