AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పండగపూట విషాదం.. ఆలయ ఆవరణలో వివాహితపై యాసిడ్ దాడి!

కామారెడ్డి జిల్లాలో పండగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భిక్కనూరు మండలం జంగంపల్లి ఎల్లమ్మ ఆలయ ఆవరణలో ఓ మహిళ యాసిడ్ దాడికి గురైంది. గుడి ఆవరణలో అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళను గుర్తించిన స్థానికులు వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి నిజామాబాద్ పట్టణానికి చెందిన దివ్యవాణిగా గుర్తించారు.

Telangana: పండగపూట విషాదం.. ఆలయ ఆవరణలో వివాహితపై యాసిడ్ దాడి!
Acid Attack In Kamareddy
Anand T
|

Updated on: Sep 14, 2026 | 1:13 PM

Share

ఓ వివాహితపై యాసిడ్‌తో దాడి చేసిన దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా బిక్కనూరు మండలానికి చెందిన దివ్యవాణి అనే మహిళకు.. పది సంవత్సరాల క్రితం నిజామాబాద్ పట్టణానికి చెందిన అరవింద్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే, గత కొన్ని నెలలుగా దంపతుల మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ మనస్పర్థల కారణంగా దివ్యవాణి తన తల్లిగారి ఊరైన బిక్కనూర్ కు వచ్చి అక్కడే ఉంటోంది.

మూడు రోజులుగా అదృశ్యం..

అయితే బిక్కనూర్ లో ఉంటున్న దివ్యవాణి గత మూడు రోజులుగా అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగానే, ఆమె జంగంపల్లి ఎల్లమ్మ టెంపుల్ వద్ద అపస్మారక స్థితిలో దారుణమైన స్థితిలో కనిపించింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అమెను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు.

భర్త కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు..

అయితే తమ కూతురు మిస్సింగ్ వెనుక, అలాగే ఈ యాసిడ్ దాడి వెనుక ఆమె భర్త, అతని కుటుంబ సభ్యుల హస్తమే ఉందని దివ్యవాణి తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us