దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గణేష్ పండగను ఏమంటారో తెలుసా?
14 Sep 2026
Anand T
ఏడాది వినాయక చవితి వచ్చేసింది. దేశ వ్యాప్తంగా పండగ సందడి నెలకొంది.. అయితే ఈ పండను మన తెలుగురాష్ట్రాల్లో వినాయక చవితి అంటా.. మరి ఇతర రాష్ట్రాల్లో ఏమని పిలుస్తారో తెలుసా?
వినాయక చవితి
విఘ్నాలను తొలగించి, సిరిసంపదలను ప్రసాదించమని ఏకదంతున్ని ప్రార్థించే పవిత్ర పండుగే వినాయక చవితి.. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఘన స్వాగతం
ఈ సంవత్సరం సెప్టెంబర్ 14 సోమవారం రోజూ వినాయక చవితిని జరుపుకుంటున్నారు భక్తులు. హిందూ క్యాలెండర్ ప్రకారం, భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చవితి తిథి నాడు స్వామివారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు.
సెప్టెంబర్ 14
ఈ గణేష్ ఉత్సవాలను మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అయితే దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాలను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో జరుపుకుంటారు.
దేశమంతటా భక్తిభావం
మహారాష్ట్రలో గణేష్ పండగను గణేశోత్సవ్ పేరుతో జరుపుకుంటే.. తమిళనాడులో వినాయగర్ చతుర్థి, కర్ణాటకలో 'గౌరీ-గణేశ, హిందీలో గణేష్ చతుర్థి అని వివిధ పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు.
గణేష్ చతుర్థి
ఇక తెలుగురాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ పండుగను వినాయక చవితి పేరుతో జరుపుకుంటారు. భక్తులు తమ ఇళ్లలో, వీధుల్లో గణనాథుని ప్రతిష్టించి కుడుములు, మోదకాలతో విశేష పూజలు చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో
గణేష్ ఉత్సవాల్లో ఎక్కవగా విణిపించే కీర్తణల్లో గణపతి బప్పా మోరియా అనే మారుమోగుతుంది. ఇది భక్తులకు, బప్పాకు మధ్య ఉన్న అపారమైన భక్తికి, ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలుస్తోంది.
గణపతి బప్పా మోరియా
ప్రాంతాలు, పేర్లు వేరైనా ఆ గణపయ్యపై ఉండే భక్తి మాత్రం అందరినీ ఏకం చేస్తుంది. ఈ పండుగ రోజున దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులందరూ ప్రార్థనలు, మోదకాలు, ఆరతులతో బప్పాకు స్వాగతం పలుకుతూ ఆనందాన్ని జరుపుకుంటారు.