మగధీర సినిమాలో నేను విలన్‌గా చేయాల్సింది.. కానీ మిస్ అయ్యింది..! చేసుంటే నా కెరీర్ ఇంకోలా ఉండేది
మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాలలో ‘మగధీర’ ఒకటి. చిరుతతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన చరణ్‌తో రాజమౌళి తెరకెక్కించిన ఈ దృశ్యకావ్యం.. టాలీవుడ్‌లో వందకోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసిన మొదటి చిత్రంగా రికార్డును సృష్టించింది. ఈ సినిమాతో రామ్ చరణ్ కు స్టార్ డమ్ వచ్చింది.

నటుడు వెంకట్ ఇటీవల ఒక ప్రత్యేక తెలుగు పోడ్‌కాస్ట్‌లో తన సుదీర్ఘ సినీ కెరీర్‌లోని పలు ఆసక్తికరమైన జ్ఞాపకాలను, ముఖ్యమైన ఘట్టాలను పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారితో అన్నయ్య సినిమా షూటింగ్ అనుభవాలు, రవితేజతో తన స్నేహం, అలాగే ఎస్.ఎస్.రాజమౌళి మగధీర చిత్రంలో ప్రధాన విలన్ పాత్ర చేజారిన విషయాలను ఆయన వెల్లడించారు. అన్నయ్య సినిమా షూటింగ్ వెంకట్ కి ఒక మధురానుభూతిని మిగిల్చిందట. చిరంజీవి గారి అద్భుతమైన కామెడీ టైమింగ్, సెట్‌లో ఆయన చూపించే ఆప్యాయత, అందరితో కలసిపోయే తత్వం వెంకట్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయట. వెంకట్, రవితేజలతో కలిసి చిరంజీవి గారు పంచుకున్న సన్నివేశాలు, ముఖ్యంగా భాగ్యనగరం మహా భాగ్యం డైలాగ్ ఉన్న సీన్‌ను ఆయన గుర్తుచేసుకున్నారు.
Hanuman Ansh: చాలా డబ్బులు వచ్చాయి.. వాటిని ఏం చేసుకోవాలో అర్ధంకావడంలేదు..: హనుమాన్ అంశ్ నిర్మాత
చిరంజీవి గారితో కలిసి టిఫిన్, భోజనం చేయడం, ఆయన క్యారేజీ నుండే ఫుడ్ రావడం వంటి విషయాలను పంచుకున్నారు. షూటింగ్ అంటే పనికి వెళ్లడంలా కాకుండా, చిరంజీవి గారిని చూడటానికి, ఆయనతో సమయం గడపడానికి వెళుతున్నట్లు అనిపించేదని వెంకట్ చెప్పుకొచ్చారు. వెంకట్ తన కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన, కానీ చేజారిన ఒక అవకాశాన్ని కూడా ఈ పోడ్‌కాస్ట్‌లో ప్రస్తావించారు. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ చిత్రం మగధీరలో ప్రధాన విలన్ పాత్ర కోసం తనను అడిగిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.
వారణాసిపై పృథ్వీరాజ్ కామెంట్స్.. టైమ్ ట్రావెల్ మూవీ కాదు.. అంతకు మించి ఉంటుందట
ఆ పాత్ర తన కెరీర్‌కు ఒక మలుపు తిప్పేదని, అది చేజారడం తన జీవితంలో అతిపెద్ద లోటుగా భావిస్తున్నానని వెంకట్ పేర్కొన్నారు. ఆ అవకాశం తనకు వచ్చి ఉంటే తన సినీ ప్రయాణం మరో విధంగా ఉండేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వెంకట్. కెరీర్‌లో ఎదుర్కొన్న వెన్నెముక గాయం (బ్యాక్ ఇంజూరీ) కూడా తన అతిపెద్ద విచారంగా వెంకట్ అభివర్ణించారు. తెలుగు సినీ పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాలు ఎందుకు తగ్గాయి అనే అంశంపై కూడా ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.
వారణాసిపై పృథ్వీరాజ్ కామెంట్స్.. టైమ్ ట్రావెల్ మూవీ కాదు.. అంతకు మించి ఉంటుందట
View this post on Instagram




