AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరంజీవి ముందు ఆ హీరోయిన్ కాలు మీద కాలు వేసుకొని కూర్చునేది.. ఎవ్వరిని లెక్క చేసేది కాదు

కొంతమంది సినీ హీరోయిన్స్ జీవితం చాలా విభిన్నంగా ఉంటుంది. కాస్ట్లీ కారులు, బ్రాడెడ్ బట్టలు, కోట్లు ఖరీదు చేసే ఇళ్లు , ఖరీదైన వాచ్ లు వాడుతుంటారు. అలాగే కొంతమంది హీరోయిన్స్ కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకుంటూ ఉంటారు. హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు.

చిరంజీవి ముందు ఆ హీరోయిన్ కాలు మీద కాలు వేసుకొని కూర్చునేది.. ఎవ్వరిని లెక్క చేసేది కాదు
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 13, 2026 | 1:09 PM

Share

తెలుగు సినిమా చరిత్రలో సిల్క్ స్మిత అనే పేరు ఒక సంచలనం.. దర్శకుడు కనగాల జయకుమార్, ఓ ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత జీవితంలోని అనేక కోణాలను వెలుగులోకి తెచ్చారు. జయకుమార్ వివరించిన దాని ప్రకారం, సిల్క్ స్మిత మొదటి నుంచి అసాధారణమైన ధైర్యం, ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యక్తి. ఆమె సెట్స్‌లో ఎప్పుడూ తన కాళ్ల మీద కాలు వేసుకొని స్టైల్‌గా కూర్చునేది. పెద్ద హీరోలు వచ్చినా సరే, ఆమె ఆ అలవాటు మార్చుకునేది కాదట. “ఇదే నా కాలు, నా కాలు మీద నేను కాలు వేసుకుంటాను నీకేంటి” అనే పుష్ప సినిమా తరహా స్వభావం ఆమెదని జయకుమార్ గుర్తు చేసుకున్నారు. ఆమె కళ్ళు, ముఖం, ముఖ్యంగా ఆ ముఖంలో ఉండే గ్లో అద్భుతమని, ఫోటోగ్రఫీలో ఆమె అందం వర్ణనాతీతమని కొనియాడారు. ఆమె కళ్ళల్లో ఒక మ్యాజిక్ ఉందని, ఆ మ్యాజిక్‌కే అందరూ పడిపోయారని, పెద్ద నటి కాకపోయినా క్లోసప్‌లలో ఆమె చాలా అందంగా కనిపించేదని ఆయన ప్రస్తావించారు. కమల్ హాసన్‌తో కలిసి తమిళంలో ఆమె నటించిన చిత్రాలను ఉదాహరణగా చూపారు.

B Gopal: తండ్రి కొడుకులను పెట్టి సినిమా చేశా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది : బి. గోపాల్

మెగాస్టార్ చిరంజీవి గారితో జరిగిన ఒక షూటింగ్ సంఘటనను జయకుమార్ వివరించారు. ఈ సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు క్రాంతి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రాంతి కుమార్ ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్, లెజెండరీ డైరెక్టర్. ఆయన ఎం.ఎ., ఎల్.ఎల్.బి. పట్టభద్రులు, గొప్ప నవలల పాఠకుడు. న్యాయం కావాలి, హీరో-హీరోయిన్ డ్యూయెట్ లేకుండా 100 రోజులు ఆడిన సీతారామయ్యగారి మనవరాలు వంటి అద్భుత చిత్రాలను తీశారు. అక్కినేని నాగేశ్వరరావు గారితో విగ్గు లేకుండా నటించాలని కండిషన్ పెట్టి యాక్ట్ చేయించిన బలమైన వ్యక్తి ఆయన. అటువంటి క్రాంతి కుమార్ దర్శకత్వంలో, చిరంజీవి గారు డైలాగ్ చెప్పుకుంటూ ముందుకు వస్తుండగా, సిల్క్ స్మిత తనదైన స్టైల్‌లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుని ఉంది. ఆమె సన్నివేశంలో ఎక్కువ ఫోర్స్ చూపించడంతో, క్రాంతి కుమార్ గారు ఆమె బుగ్గను సున్నితంగా తాకారు. ఇది బయట “చెంపదెబ్బ”గా ప్రచారంలో ఉన్నప్పటికీ, నటనలో సరిదిద్దడానికి చేసిందేనని, ఆమె ఓవరాక్షన్ చేస్తున్నారని భావించి నెమ్మదిగా సరిదిద్దారని జయకుమార్ స్పష్టం చేశారు. ఈ సంఘటన తర్వాత సిల్క్ స్మితను శాంతపరిచి మళ్ళీ షాట్ తీశారట.

అప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

సినీ రంగంలో సిల్క్ స్మిత ఎన్నో అవమానాలను, కష్టాలను ఎదుర్కొన్నారని జయకుమార్ తెలిపారు. ఆమెను కేవలం వేంపు క్యారెక్టర్లలో చూడటం, సెట్స్‌లో ఇబ్బంది పెట్టడం వంటివి జరిగాయని చెప్పారు. ఈ అవమానాలు ఆమెను మరింత దృఢంగా మార్చాయని, ఎవరినీ లెక్కచేయకుండా ఇండస్ట్రీ మీద ఎదురు తిరిగిందని చెబుతారు. ఆమె స్టార్‌డమ్ ఎంతగా పెరిగిందంటే, ఒకసారి ఆమె కొరికిన యాపిల్ 25,000 రూపాయలకు వేలం వేయబడిందని, అప్పట్లో ఏ హీరోయిన్‌కు అంత క్రేజ్ లేదని జయకుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సిల్క్ స్మిత పాట ఉంటేనే డిస్ట్రిబ్యూటర్లు సినిమాలు తీసుకునేవారని, అంతగా ఆమె డిమాండ్ ఉండేదని అన్నారు .

ఇవి కూడా చదవండి

నా కులం వాళ్లే కుట్ర చేశారు.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామన్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరో

Silk Smitha

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us