AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అదిరిపోయే సూపర్ న్యూస్.. వాట్సప్‌లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. జస్ట్ ఇలా చేస్తే..

ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే వాట్సప్ సేవలను ప్రారంభించనుంది. దీంతో ఖాతాదారులు వాట్సప్ నుంచే అన్నీ పరిష్కరించుకోవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. జస్ట్ హాయ్ అని ఒక్క మెస్సేజ్ పెడితే సరిపోతుంది. దీని గురించ కార్మికశాఖ మంత్రి ప్రకటన చేశారు.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అదిరిపోయే సూపర్ న్యూస్.. వాట్సప్‌లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. జస్ట్ ఇలా చేస్తే..
Epfo
Venkatrao Lella
|

Updated on: Sep 14, 2026 | 1:11 PM

Share

ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే చందాదారులు సులభంగా సేవలు పొందేలా వాట్సప్ చాట్ బాట్‌ను తీసుకురానుంది. పీఎఫ్ డిజిటల్ సేవలను వినియోగదారులకు సులభంగా అందించాలనే ఉద్దేశంతో ఈ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో వాట్సప్ నుంచే సులువుగా పీఎఫ్ సేవలు పొందవచ్చు. ఇందుకోసం పీఎఫ్ వెబ్ సైట్ లేదా ఉమాంగ్ యాప్ ప్రతీసారి తెరవాల్సిన పని ఉండదు. పీఎఫ్ సేవలను మరింత సౌకర్యవంతంగా మార్చాలనే ఉద్దేశంతో వాట్సప్ చాట్ బాట్ తీసుకొస్తున్నారు. ఇక పీఎఫ్ ఆఫీసులను సందర్శించాల్సిన అవసరాన్ని తగ్గించడం, ఫిర్యాదులను పరిష్కరించాన్ని వేగవంతం చేసేందుకు వాట్సప్ సేవలు ఉపయోగపడనున్నాయి.

త్వరలోనే వాట్సప్ నెంబర్..

త్వరలో ఈపీఎఫ్ఓ వాట్సప్ నెంబర్‌ను తీసుకురానుండగా.. దీనికి హాయ్ అని మెస్సేజ్ చేస్తే సరిపోతుంది. ఇక ఖాతాదారులు సులువుగా గుర్తించేందుకు వాట్సప్ నెంబర్‌కు ఆకుపచ్చ టిక్ గుర్తుతో ధృవీకరించనున్నారు. అయితే అనేక భాషల్లో చాట్ బాట్ సేవలు అందించనుంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులు ఈ సేవలను ఈజీగా ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ చాట్ బాట్ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ వాట్సప్‌లోనే సెకన్లలోనే చెక్ చేసుకోవచ్చు. అలాగే ప్రతీ నెలా మీ కంపెనీ జమ చేసే కాంట్రిబ్యూషన్స్, క్లెయిమ్ స్టేటస్ వంటివి తెలుసుకోవచ్చు. అలాగే పెండింగ్‌లో ఉన్న కంప్లైంట్ యాక్సెస్ చేయవచ్చు. ఈ చాట్ బాట్‌కు ఏఐ సాంకేతికత జోడించనున్నారు. దీంతో మీ అనుమానాలను వెంటనే నివృత్తి చేయనుంది. సాధారణ ప్రజలకు ఏఐనే సమాధానం అందిస్తుంది. ఇక ఆధార్ వెరిఫికేషన్, బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్డేట్ చేసుకోవడానికి సంబంధించి వాట్సప్‌కు నోటిఫికేషన్లు కూడా అందుతాయి. దీనిని గురించి మీరు వెంటనే అప్డేట్ చేసుకోవచ్చు. ఇక పీఎఫ్ విత్ డ్రా, పెన్షన్‌కు సంబంధించి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని పరిష్కరించుకోవడంలో వాట్సప్ చాట్ బాట్ ద్వారా జాప్యం తగ్గుతుంది. ఇలా చాట్ బాట్ ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

అందుబాటులోకి ఎప్పుడు వస్తుందంటే..?

ఇటీవల కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ దీని గురించి ప్రకటన చేశారు. త్వరలోనే దీనిని తీసుకొస్తామని ప్రకటించారు. దీంతో త్వరలోనే దీనిని ఈపీఎఫ్ఓ అందుబాటులోకి తీసుకురావొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఎక్కువమంది వాట్సప్ ఉపయోగిస్తున్నారు. దీంతో వాట్సప్ ద్వారానే అన్నీ సేవలు పొందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా పీఎఫ్ ఖాతాదారులు కూడా చాట్ బాట్ సేవలు అందించనున్నారు.

Follow Us