AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోసిన నిమ్మకాయ ఎన్ని రోజులైన ఫ్రెష్‌గా ఉంటుంది.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..

వంటలో అరచెక్క పిండి, మిగిలిన సగం నిమ్మకాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? మరుసటి రోజు తీసేసరికి అది బండరాయిలా ఎండిపోయి, రసం రాక విసిగిస్తుందా? అయితే మీలాంటి వారి కోసమే ఈ సింపుల్ వంటింటి చిట్కా.. చిన్న ట్రిక్ పాటిస్తే కోసిన నిమ్మచెక్క రోజుల తరబడి ఫ్రెష్‌గా, రసంతో నిండి ఉండేలా ఎలా దాచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

కోసిన నిమ్మకాయ ఎన్ని రోజులైన ఫ్రెష్‌గా ఉంటుంది.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
How To Store Cut Lemon In Fridge
Krishna S
|

Updated on: Sep 14, 2026 | 12:52 PM

Share

రోజూ వంటల్లో, సలాడ్లలో లేదా నిమ్మరసం కోసం సగం చెక్కను వాడి, మిగిలిన సగాన్ని ఫ్రిజ్‌లో దాచిపెట్టడం ప్రతి ఇంటా సర్వసాధారణం. అయితే మరుసటి రోజు తీసి చూస్తే ఆ నిమ్మచెక్క ఎండిపోయి, గట్టిపడిపోయి రసం సరిగ్గా రాదు. పైగా ఫ్రిజ్‌లో ఉండే ఇతర పదార్థాల వాసనలను పీల్చుకుని దాని సహజ సువాసన కూడా మారిపోతుంది. ఈ చిన్న సమస్యకు వంటిట్లోనే దొరికే సాధారణ వస్తువులతో సులభంగా పరిష్కారం కనుగొనవచ్చని గృహిణులు, నిపుణులు సూచిస్తున్నారు.

ఎందుకు ఎండిపోతుంది?

నిమ్మకాయను కోసిన వెంటనే లోపలి గుజ్జు గాలితో సంపర్కంలోకి వస్తుంది. రిఫ్రిజిరేటర్‌లోని పొడి, చల్లని వాతావరణం వల్ల కోసిన ఉపరితలంపై ఉన్న తేమ చాలా వేగంగా ఆవిరైపోతుంది. దీనివల్ల పైపొర గట్టిపడి, రసం పిండటానికి వీలులేకుండా మారుతుంది.

తాజాగా నిల్వ ఉంచే సులభమైన మార్గాలు

అల్యూమినియం ఫాయిల్: కోసిన నిమ్మచెక్క భాగానికి గాలి తగలకుండా చిన్న అల్యూమినియం ఫాయిల్ ముక్కతో గట్టిగా చుట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇది తేమ ఆవిరైపోకుండా ఆపడమే కాకుండా, ఫ్రిజ్‌లోని ఇతర ఘాటైన వాసనలు నిమ్మకాయకు అంటుకోకుండా చూస్తుంది.

ఎయిర్ టైట్ కంటైనర్: అల్యూమినియం ఫాయిల్ అందుబాటులో లేకపోతే చిన్న ఎయిర్ టైట్ డబ్బాను ఉపయోగించవచ్చు. నిమ్మకాయ కోసిన భాగం కిందికి ఉండేలా పెట్టి మూత గట్టిగా వేస్తే గాలి తగలకుండా తాజాగా ఉంటుంది.

సిలికాన్ కవర్లు: పర్యావరణానికి మేలు చేసే రీయూజబుల్ సిలికాన్ ఫుడ్ క్యాప్స్ వాడటం వల్ల నిమ్మకాయ చెక్కలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవచ్చు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

  • కోసిన నిమ్మకాయను మరీ ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచకుండా రెండు, మూడు రోజుల్లోనే వాడేయడం ఆరోగ్యానికి మంచిది.
  • నిమ్మకాయపై బూజు పట్టినా, ఉపరితలం జిగటగా మారినా లేదా రంగు మారి చెడు వాసన వస్తున్నా దాన్ని వాడకుండా పారవేయాలి.
  • ఫ్రిజ్‌లో పెట్టే ముందు నిమ్మకాయ బయటి భాగం తడి లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి.

Follow Us