AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళా బైకర్‌ను వెంటాడి.. కారుతో ఢీకొట్టిన పోకిరీలు! వీడియో వైరల్

ఓ మహిళా బైకర్‌ను కారు ఢీకొట్టి అక్కడి నుంచి పరారైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దారుణ ఘటన గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తున్న సియా అనే మహిళా బైకర్ రోడ్డుపై పడిపోయారు. అయితే ప్రమాదానికి కారణమైన కారు తనదే అయినప్పటికీ.. తాను మాత్రం కారు నడపలేదని దాని యజమాని మనీష్ చెబుతున్నారు. బాధితురాలు సియా తెలిపిన వివరాల ప్రకారం..

మహిళా బైకర్‌ను వెంటాడి.. కారుతో ఢీకొట్టిన పోకిరీలు! వీడియో వైరల్
Woman Biker Hit By Car In Gurugram
Srilakshmi C
|

Updated on: Sep 14, 2026 | 12:17 PM

Share

గురుగ్రామ్‌, సెప్టెంబర్ 14: ఆదివారం ఆమె తన బైకర్ గ్రూప్ సభ్యులతో కలిసి గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌పై వెళ్తున్నారు. ఈ సమయంలో ఓ మారుతి సుజుకి సియాజ్ కారు ఆమె బైక్‌ను వెంబడించింది. కారులో ఉన్నవారు దూకుడుగా ప్రవర్తించడంతో పాటు, మద్యం సేవించినట్లు కనిపించారని సియా ఆరోపించింది. కారు తమకు కొంత దూరం డిస్టెన్స్‌ పాటించాలని తాను సూచించినప్పటికీ.. వారు బైక్‌ను ఆపాలని కోరినట్లు సియా చెప్పింది. దీంతో తాను ముందుకు వెళ్తూనే ఉండగా, వెనుక వస్తున్న తన స్నేహితుడు కారును అడ్డుకునేందుకు ప్రయత్నించాడని, కారు తనను వెంబడించడం కొనసాగించిందని వాపోయింది.

చివరకు కారు డ్రైవర్ తన బైక్‌కు అడ్డంగా వచ్చేందుకు ప్రయత్నించడంతో సియా నడుపుతున్న Aprilia RS 457 బైక్‌ను మారుతి సుజుకి సియాజ్‌ను ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో సియా బైక్‌పై నుంచి రోడ్డుపై పడిపోయింది. అనంతరం కారు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఆమె తెలిపారు. ప్రమాదం తర్వాత సియా స్నేహితుల్లో ఒకరు కారును వెంబడించి ఆపేందుకు ప్రయత్నించారని, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆగినప్పుడు డ్రైవర్‌ను ప్రశ్నించారని సియా తెలిపింది. అయితే డ్రైవర్ తన తప్పేమీ లేదంటూ అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sia (@rebelwheels_sia_)

కారు యజమాని ఎవరు?

ఈ ప్రమాదానికి సంబంధించిన మారుతి సుజుకి సియాజ్ వివరాలను పరిశీలించగా, HR30Y4949 రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న కారు హర్యానాలోని పల్వాల్‌కు చెందిన మనీష్ పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్లు వెల్లడైంది. అయితే కారు యజమాని మనీష్ మాత్రం తాను ప్రమాద సమయంలో కారులో లేనని స్పష్టం చేశారు. తాను ఆర్మీలో పనిచేస్తున్నానని, ప్రస్తుతం అసోంలో విధుల్లో ఉన్నానని తెలిపారు. ఆదివారం తన కుటుంబ సభ్యుల నుంచి తన స్నేహితుడు కల్యాణ్ కారు తీసుకెళ్లాడని మనీష్ చెప్పారు. కారు ప్రమాదానికి గురైన విషయం తనకు వీడియో వైరల్ అయిన తర్వాతే తెలిసిందన్నారు. ఈ ఘటనపై సియా గురుగ్రామ్ పోలీసులను చర్యలు తీసుకోవాలని బాధితురాలు సియా కోరారు. రోడ్లపై ఇతర వాహనదారుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తూ ప్రమాదాలు చేసి, అనంతరం అక్కడి నుంచి పరారయ్యే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Follow Us