AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారికి అలర్ట్‌.. RRB పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌..!

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) 119 సెక్షన్‌ కంట్రోలర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీలను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేసే పోస్టులకు ఎంపిక విధానం పలు దశల్లో ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక CBT, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (CBAT), ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా జరుగుతుంది. తొలుత కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు..

రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారికి అలర్ట్‌.. RRB పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌..!
RRB Section Controller Exam Date
Srilakshmi C
|

Updated on: Sep 14, 2026 | 6:44 AM

Share

హైదరాబాద్‌, సెప్టెంబర్ 14: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) కీలక ప్రకటన చేసింది. సెక్షన్‌ కంట్రోలర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీలను తాజాగా విడుదల చేసింది. CEN No. 03/2026 కింద మొత్తం 119 సెక్షన్‌ కంట్రోలర్‌ పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షను అక్టోబర్‌ 12, 13 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు RRB వెల్లడించింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచే పరీక్షకు సంబంధించిన సూచనలు, షెడ్యూల్‌ను పరిశీలించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

ఎంపిక ప్రక్రియ ఇలా..

సెక్షన్‌ కంట్రోలర్‌ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పలు దశల్లో జరుగుతుంది. తొలుత కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (CBAT) నిర్వహిస్తారు. తదుపరి దశలో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన (Document Verification) చేపడతారు. చివరగా మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష తేదీలు విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులు తమ పరీక్షకు సంబంధించిన వివరాలను RRB అధికారిక వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు పరిశీలించాలి. పరీక్షకు హాజరయ్యే ముందు అడ్మిట్‌ కార్డు, పరీక్ష కేంద్రం, సమయం తదితర వివరాలను తప్పనిసరిగా చెక్‌ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన వివరాలు..

  • పోస్టుల సంఖ్య: 119
  • పోస్టు: సెక్షన్‌ కంట్రోలర్‌
  • CEN: 03/2026
  • పరీక్ష తేదీలు: అక్టోబర్‌ 12, 13, 2026
  • ఎంపిక విధానం: CBT, CBAT, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌

Follow Us