AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ప్రివ్యూ చేసి ఎవడొస్తాడు ఈ సినిమాకు అన్నారు.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది

దర్శకుడు శివనాగేశ్వరరావు తన తొలి చిత్రం మనీ ప్రివ్యూ సమయంలో ఎం.ఎస్.రెడ్డి గారితో జరిగిన ఆసక్తికర సంఘటనను వివరించారు. మొదట సినిమాను తక్కువ అంచనా వేసిన ఎం.ఎస్.రెడ్డి, దాని అద్భుత విజయం తర్వాత బహిరంగంగా తన అభిప్రాయాన్ని ఉపసంహరించుకొని, శివనాగేశ్వరరావును మనస్ఫూర్తిగా అభినందించారు. ఇది దర్శకుడికి లభించిన ఒక మధురమైన జ్ఞాపకం.

Tollywood : ప్రివ్యూ చేసి ఎవడొస్తాడు ఈ సినిమాకు అన్నారు.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది
Movie
Rajeev Rayala
|

Updated on: Sep 14, 2026 | 11:54 AM

Share

దర్శకుడు శివనాగేశ్వరరావు తన కెరీర్‌లో అత్యంత కీలకమైన, మరచిపోలేని సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంటూ, తన తొలి చిత్రం మనీ విడుదలకు ముందు, తర్వాత ఎం.ఎస్.రెడ్డి గారితో జరిగిన అనుభవాలను వివరించారు. మనీ సినిమా విడుదలకు ముందు, అన్నపూర్ణ స్టూడియోలో ఎం.ఎస్.రెడ్డి గారు, సి.నారాయణ రెడ్డి గారు ఈ సినిమా ప్రత్యేక ప్రొజెక్షన్‌లో వీక్షించారు. సినిమా పూర్తయిన తర్వాత, ఎం.ఎస్.రెడ్డి గారు దర్శకుడి భుజంపై చేయి వేసి, “నాగేశ్వరరావు, దీంట్లో పల్లెటూరి జనం చూడటానికి ఏముంది.?” అని సూటిగా ప్రశ్నించారట. ఆయన అలా అనడంతో దర్శకుడికి కొంత నిరుత్సాహాన్ని కలిగించిందట. అప్పటికే సినిమా విడుదల అవుతుందో లేదో అన్న అనుమానంలో ఉన్న శివనాగేశ్వరరావుకు ఈ మాటలు మరింత ఆందోళన కలిగించాయట. అయితే, మనీ సినిమా విడుదలైన తర్వాత అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఇది అన్నపూర్ణ స్టూడియోలో 50 రోజులకు పైగా, ఓడియన్‌ థియేటర్‌లో 130 రోజులకు పైగా ఆడి అఖండ విజయం సాధించింది. ఈ విజయానికి గుర్తుగా వంశీ బర్క్లీ, వంశీ రామరాజులు మనీ యూనిట్‌కు అభినందన సభను త్యాగరాయ గానసభలో ఏర్పాటు చేశారు. శివనాగేశ్వరరావుకు సన్మానాలు ఇష్టం లేకపోయినా, మనీ యూనిట్‌కు అభినందన సభ అనే పేరుతో సరేనని ఒప్పుకున్నారు. ఈ సభకు ఎం.ఎస్.రెడ్డి గారు అధ్యక్షత వహించారు. సభ అనంతరం, దర్శకుడు శివనాగేశ్వరరావుకు సత్కారం ప్రకటించగా, ఆయన వేదికపైకి రావడానికి ఆలోంచించారట. అప్పుడు ఎం.ఎస్.రెడ్డి గారే స్వయంగా శివనాగేశ్వరరావును వేదికపైకి లాక్కొని, శాలువా కప్పి, బొకే అందించి సత్కరించారు.

Hanuman Ansh: చాలా డబ్బులు వచ్చాయి.. వాటిని ఏం చేసుకోవాలో అర్ధంకావడంలేదు..: హనుమాన్ అంశ్ నిర్మాత

అనంతరం ఎం.ఎస్.రెడ్డి గారు మాట్లాడుతూ, “ఈ సినిమా నేను ప్రివ్యూ చూశాను. పల్లెటూరి వాళ్ళు చూడటానికి దీంట్లో ఏముందని ఈ దర్శకుడిని అడిగాను. కానీ, నాదే తప్పు. మనకు తెలియంది ఈ సినిమాలో చాలా ఉందని నేను అర్థం చేసుకున్నాను. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను” అని బహిరంగంగా తన తప్పును ఒప్పుకొని, దర్శకుడిని మనస్ఫూర్తిగా అభినందించారట. ఇది శివనాగేశ్వరరావుకు జీవితంలో మరచిపోలేని రివర్స్‌ పంచ్‌ సంఘటనగా నిలిచిపోయింది. ఎం.ఎస్.రెడ్డి గారితో శివనాగేశ్వరరావుకు మరో అనుభవం ఉంది. ఎం.ఎస్.రెడ్డి గారు ఒక మలయాళ సినిమాను రీమేక్‌ చేయాలనుకొని, శివనాగేశ్వరరావుకు చూపించారట. అయితే, అప్పటికే తాను అలాంటి కథాంశంతో వన్‌ బై టూ లక్కీ ఛాన్స్‌ అనే సినిమా తీశానని శివనాగేశ్వరరావు చెప్పినా, ఎం.ఎస్.రెడ్డి గారు పట్టుబట్టారట. ఆ సినిమాకు సంగీత దర్శకుడిగా మాధవపెద్ది సురేష్‌ను నియమించాలని ఎం.ఎస్.రెడ్డి గారు బలంగా నొక్కి చెప్పారట.

వారణాసిపై పృథ్వీరాజ్ కామెంట్స్‌.. టైమ్ ట్రావెల్ మూవీ కాదు.. అంతకు మించి ఉంటుందట

కానీ  శివనాగేశ్వరరావు మణిశర్మ లేదా రాజ్‌-కోటి వంటివారిని అనుకున్నా, ఎం.ఎస్.రెడ్డి గారి నిర్ణయం మారలేదట. పాటల విషయంలో కూడా, ఒక బ్యాక్‌గ్రౌండ్ పాటను ఎం.ఎస్.రెడ్డి గారి చేత రాయించుకోవాలని శివనాగేశ్వరరావు ప్రయత్నించగా, ఎం.ఎస్.రెడ్డి గారు “నాగేశ్వరరావు, తెలివిగా మాట్లాడుతున్నావనుకుంటున్నావేమో, పాటలన్నీ నేనే రాస్తాను. అట్టయితేనే ఈ సినిమా” అని కరాఖండిగా చెప్పారట. అంత మొండిగా ఉండేవారు అని శివనాగేశ్వరరావు తెలిపారు. అలాగే ఈ ఇంటర్వ్యూలో శివనాగేశ్వరరావు తన స్పాంటేనియస్‌ డైలాగ్‌ రైటింగ్‌  గురించి కూడా ప్రస్తావించారు. తనకు ప్రత్యేకంగా డైలాగ్‌లు రాయాలని ప్రయత్నిస్తే రావు కానీ, ఆ క్షణంలో అనూహ్యంగా వచ్చేస్తాయని చెప్పారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి ప్రముఖులు, చక్రవర్తి వంటి స్నేహితులు తనను డైలాగ్‌లు లేదా పుస్తకాలు రాయమని ప్రోత్సహించినప్పటికీ, తాను ఇంతవరకు ఆ పనిని సీరియస్‌గా తీసుకోలేదని శివనాగేశ్వరరావు తెలిపారు.

ఇవి కూడా చదవండి

వారణాసిపై పృథ్వీరాజ్ కామెంట్స్‌.. టైమ్ ట్రావెల్ మూవీ కాదు.. అంతకు మించి ఉంటుందట

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us