ఇంటర్ పాసైన వారికి 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.92,300 వరకు జీతం
కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ‘కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (CHSL)-2026’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, సంస్థలు, కార్యాలయాలు, ట్రైబ్యునళ్లలో లోయర్ డివిజనల్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)..

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు మంచి అవకాశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ‘కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (CHSL)-2026’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, సంస్థలు, కార్యాలయాలు, ట్రైబ్యునళ్లలో లోయర్ డివిజనల్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియలో దాదాపు 2,536 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 7, 2026లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ (12వ తరగతి) లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. అయితే DEO, DEO గ్రేడ్-A పోస్టులకు గణితం ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీమ్‌లో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే 2026 అక్టోబర్ 1 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1999 ఆగస్టు 2 నుంచి 2008 ఆగస్టు 1 మధ్య జన్మించిన వారు అర్హులు. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు గరిష్ఠంగా 15 ఏళ్ల వరకు సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 10, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక టైర్-1, టైర్-2 పరీక్షల ద్వారా జరుగుతుంది. అనంతరం ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ప్రక్రియ ఉంటుంది. సంబంధిత పోస్టుకు అవసరమైన నిబంధనల ప్రకారం తుది ఎంపిక చేపడతారు. ఎంపికైన వారికి రూ.92 వేల వరకు జీతంగా చెల్లిస్తారు.
SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టైర్ 1 పరీక్ష విధానం
టైర్ 1 పరీక్షకు మొత్తం 200 మార్కులు కేటాయించారు. 100 ప్రశ్నలు ఉండే ఈ పరీక్షలో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ – 25 ప్రశ్నలు, 50 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ – 25 ప్రశ్నలు, 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ – 25 ప్రశ్నలు, 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ – 25 ప్రశ్నలు, 50 మార్కులు చొప్పున కేటాయిస్తారు.
టైర్2 పరీక్ష
టైర్ 1లో అర్హత సాధించిన వారికి టైర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. టైర్ 2 పరీక్షకు 405 మార్కులు కేటాయించారు. ఇందులో మ్యాథమేటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 7, 2026.
- ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: అక్టోబర్ 8, 2026
- దరఖాస్తు సవరణలు: అక్టోబర్ 14 నుంచి 16 వరకు
SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




