వెల్లుల్లి చేసే మేలు తెలిస్తే రోజూ తింటారు.. కానీ వీరు జాగ్రత్త!
14 September 2026
TV9 Telugu
TV9 Telugu
వెల్లుల్లిలోని యాంటీ క్లాటింగ్ గుణాలు గుండె జబ్బులతో బాధపడే వారికి రక్తం గడ్డ కట్టకుండా చేసి ఎంతో మేలు చేస్తుంది
TV9 Telugu
అయితే అప్పటికే మందులు వాడుతున్న వారికి ఇది ప్రత్యామ్నాయం కాదంటున్నారు. అలాగే వివిధ రకాల శస్త్రచికిత్సలు చేయించుకోబోయే వారు వెల్లుల్లికి దూరంగా ఉండాలి
TV9 Telugu
వీరి వినియోగం విషయంలో ఓసారి వైద్యుడిని సంప్రదించి తగిన సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు
TV9 Telugu
అధిక బరువుతో ఇబ్బందిపడేవారు వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ప్రయోజనం పొందే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు
TV9 Telugu
కారణం వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే పదార్థమే. ఇందులోని ఔషధ గుణాలు రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్‌ని తగ్గించి, శరీర బరువును తగ్గించడంలో సహకరిస్తాయని చెబుతున్నారు
TV9 Telugu
వెల్లుల్లి తీసుకోని వారితో పోల్చితే.. తరచూ ఆహారంలో భాగంగా దీన్ని తీసుకునే వారిలో జలుబు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తక్కువగా వస్తాయట
TV9 Telugu
వీటితో పాటు వెల్లుల్లిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల కారణంగా గొంతు సంబంధిత సమస్యలు బాధించవట
TV9 Telugu
అందుకే గొంతు నొప్పితో బాధపడేవారు వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు