కూల్‌డ్రింక్స్‌ తాగే వారికి డేంజర్‌ బెల్స్‌.. చక్కెరతో క్యాన్సర్‌ పక్కా!

14 September 2026

TV9 Telugu

TV9 Telugu

షుగర్‌ అధికంగా ఉండే పానీయాలను రెగ్యులర్‌గా తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదన్న విషయం తెలిసిందే!

TV9 Telugu

అయితే, అది కేవలం బరువు పెరగడమో, మధుమేహం రావడానికో మాత్రమే పరిమితం కాదని నిపుణులు అంటున్నారు

TV9 Telugu

కృత్రిమ చక్కెరలు కలిపిన పానీయాలు ఎక్కువగా తాగితే.. కడుపు క్యాన్సర్‌ ముప్పు రెట్టింపు అవుతుందని హెచ్చరిస్తున్నారు

TV9 Telugu

సాధారణ కూల్‌డ్రింక్స్‌, ఎనర్జీ డ్రింక్స్‌, ప్యాక్‌ చేసిన ఫ్రూట్‌ జ్యూస్‌లలో  చక్కెర ఎక్కువగా ఉంటుంది. చాలామంది వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటారు

TV9 Telugu

అయితే, ఇలాంటి వాటిని అస్సలు ముట్టుకోని వారు, చాలా అరుదుగా తాగేవారితో పోలిస్తే.. ప్రతిరోజూ తాగేవారికి కడుపు క్యాన్సర్‌ వచ్చే అవకాశం 2 రెట్లు ఎక్కువట

TV9 Telugu

ఈ పానీయాలలోని అధిక చక్కెర.. జీర్ణవ్యవస్థలో అంతర్గత ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతుంది. ఇది కణాలను దెబ్బతీస్తుంది

TV9 Telugu

ఇక ద్రవరూపంలోని చక్కెర నేరుగా శరీరంలోకి వెళ్లినప్పుడు.. రక్తంలో గ్లూకోజ్‌, ఇన్సులిన్‌ స్థాయులు ఒక్కసారిగా పెరుగుతాయి

TV9 Telugu

దీర్ఘకాలంలో ఇది ‘ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌’కు దారితీసి, క్యాన్సర్‌ కణాలు పెరిగేందుకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది