ఐదు రూపాయల కాయిన్ మింగేసిన మూడేళ్ల బాలుడు..!
పాల్వంచ మండలం నాగారం కాలనీకి చెందిన తేజావత్ శరత్ (3) బాలుడు ఇంట్లో సరదాగా ఆడుకుంటూ ఐదు రూపాయల కాయిన్‌ను మింగేశాడు. కాయిన్ గొంతులో ఇరుక్కోవడంతో శ్వాస తీసుకోవడానికి..
పాల్వంచ మండలం నాగారం కాలనీకి చెందిన తేజావత్ శరత్ అనే మూడేళ్ల బాలుడు ఇంట్లో సరదాగా ఆడుకుంటూ ఐదు రూపాయల కాయిన్‌ను మింగేశాడు. కాయిన్ గొంతులో ఇరుక్కోవడంతో శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడ్డాడు. బాలుడు ఏడుస్తుండడంతో గమనించిన తల్లిదండ్రులు బాలున్ని అడగగా కాయిన్ మింగినట్లు తెలపడంతో దానిని తీయడానికి తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీనితో బాలుడు అస్వస్థతకు గురవుతున్న క్రమంలో కొత్తగూడెంలోని “వి కేర్” హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. డాక్టర్ మహమ్మద్ పాషా 2 గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేసి కాయిన్‌ను బయటకు తీయడంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. చిన్న పిల్లలు ఆడుకునే సమయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకొని వారిని పరిశీలిస్తూ ఉండాలని డాక్టర్లు సూచించారు.
Read More: ఏపీ ప్రజలకు హ్యాపీ న్యూస్.. అక్కడ కరోనా లేదట!
Read More This Also : విశాఖలో సెక్రటేరియట్‌కు స్థలం రెడీ.. సీఎం గ్రీన్ సిగ్నల్!
ఇది కూడా చదండి: బిగ్ బ్రేకింగ్ న్యూస్: 46 వేలకు చేరుకున్న బంగారం!