AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Drown: జగిత్యాల జిల్లాలో విషాదం.. ఎస్సారెస్పీ కెనాల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు గల్లంతు..

Car Drown: జగిత్యాలలో విషాదం చోటు చేసుకుంది. దైవదర్శనానికి వెళ్తూ తిరిగిరాని లోకానికి వెళ్లారు. ఒకే కుటుంబానికి ముగ్గురు వ్యక్తులు..

Car Drown: జగిత్యాల జిల్లాలో విషాదం.. ఎస్సారెస్పీ కెనాల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు గల్లంతు..
Shiva Prajapati
|

Updated on: Feb 15, 2021 | 9:20 AM

Share

Car Drown: జగిత్యాలలో విషాదం చోటు చేసుకుంది. దైవదర్శనానికి వెళ్తూ తిరిగిరాని లోకానికి వెళ్లారు. ఒకే కుటుంబానికి ముగ్గురు వ్యక్తులు ఎస్ఆర్ఎస్పీ కాలువలో పడి మృత్యువాత పడ్డారు. పూర్తి వివరాల్లోకెళితే.. జగిత్యాల జిల్లాకు చెందిన న్యాయవాది కట్కూరి అమరేంద్ర రావు ఆయన భార్య శిరీష, కూతురు శ్రేయ, కొడుకు జయంత్ కుటుంబ సమేతంగా జోగినిపల్లికి దైవదర్శనం కోసం ఈరోజు తెల్లవారుజామున కారులో బయలుదేరారు. అయితే మేడిపల్లి-కట్లకుంట మధ్య ఉన్న ఎస్సారెస్పీ కాలువ సమీపానికి రాగానే.. కారు కాలువలోకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో అమరేందర్, శిరీష, శ్రేయ మృత్యువాత పడగా.. వారి కుమారుడు జయంత్ ఈత కొట్టుకుంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. కాలువలోకి దూసుకెళ్లిన కారును బయటకు తీశారు. కారులో ముగ్గురి మృతదేహాలు ఉన్నాయి. నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు.. ప్రమాదంపై కేసు నమోదు చేశారు. కాగా, ప్రమాదానికి గురైన అమరేందర్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సమీప బంధువులు.

Also read:

Today Gold Rates (15022021): రోజురోజుకు తగ్గుతున్న పసిడి ధరలు.. వెండి మాత్రం పైపైకి.. తాజా రేట్లు ఇలా..

వాలంటైన్స్ డే: తమ కలలరాణి నిధి అగర్వాల్‌కు గుడి కట్టి, అభిమానుల పాలాభిషేకం.. షాక్‌కు గురైన నటి