AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధర్మపురిలో పట్టపగలు రెచ్చిపోయిన దొంగలు.. ఇంటి తాళం పగలగొట్టి దోపిడీ!

గత కొంత కాలంగా వరుస దొంగతనాలతో కంటి మీద కునుకులేకుండా చేస్తున్న దొంగలు.. తాజాగా జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఓ బట్టల వ్యాపారి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఎప్పటి మాదిరి గానే ఉదయం ఇంటికి తాళం వేసి బట్టల దుఖాణంకి వెళ్లిన వ్యాపారి ఇంటిని గుట్టు చప్పుడు కాకుండా దొంగలు దోచుకున్నారు..

ధర్మపురిలో పట్టపగలు రెచ్చిపోయిన దొంగలు.. ఇంటి తాళం పగలగొట్టి దోపిడీ!
Dharmapuri Cloth Merchant House Robbery
Srilakshmi C
|

Updated on: Aug 31, 2025 | 5:56 PM

Share

జగిత్యాల, ఆగస్ట్‌ 31: రాష్ట్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. గత కొంత కాలంగా వరుస దొంగతనాలతో కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఓ బట్టల వ్యాపారి ఇంట్లో దొంగలు చోరీ చేశారు. ఎప్పటి మాదిరి గానే ఉదయం ఇంటికి తాళం వేసి బట్టల దుఖాణంకి వెళ్లిన వ్యాపారి ఇంటిని గుట్టు చప్పుడు కాకుండా దొంగలు దోచుకున్నారు. ఈ షాకింగ్‌ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అసలేం జరిగిందంటే..

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఆంగ్లో వేదిక్ పాఠశాల వీధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. బట్టల వ్యాపారి ఇంట్లో తాళం పగులగొట్టి ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. ఆనక బంగారు నగలు, దుస్తులు అపహరించి తీసుకెల్లినట్టు పోలీసులు తెలిపారు. యజమాని ఇంటికి తాళం వేసి యధావిధిగా బట్టల షాపుకు వెళ్ళాడు. రాత్రి వేళలో తిరిగి ఇంటికి రాగా.. ఇంటి డోర్‌కు వేసిన తాళం పగిలిపోయి ఉండటం చూసి ఖంగు తిన్నారు. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా.. బీరుగా తీసి ఉంది.

అందులో ఉంచిన నగలు, దుస్తులు చోరీ జరిగినట్టు గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు విచారణ చేపట్టారు. సుమారు 7 తులాల బంగారం, కొంత నగదు దొంగలించినట్లు ఇంటి యజమాని ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.https://tv9telugu.com/telangana

1615911,1615953,1615945,1615972

రాజమౌళి 'వారణాసి'లో మరో స్టార్ యాక్టర్.. మహేష్ తండ్రి పాత్రలో..
రాజమౌళి 'వారణాసి'లో మరో స్టార్ యాక్టర్.. మహేష్ తండ్రి పాత్రలో..
2 రోజుల్లో CSIR UGC NET 2025 రాత పరీక్షలు.. అడ్మిట్ కార్డుల లింక్
2 రోజుల్లో CSIR UGC NET 2025 రాత పరీక్షలు.. అడ్మిట్ కార్డుల లింక్
కారు లుక్‌ మార్చాలని.. డబ్బుతో పాటు ఇంకా చాలా నష్టపోతారు!
కారు లుక్‌ మార్చాలని.. డబ్బుతో పాటు ఇంకా చాలా నష్టపోతారు!
తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం, వెండి ధరలు..!
తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం, వెండి ధరలు..!
శోభన్ బాబుపై మురళీ మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
శోభన్ బాబుపై మురళీ మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
RRB NTPC 2024 గ్రాడ్యుయేట్‌ ఫలితాలు విడుదల.. స్కోర్‌ కార్డు లింక్
RRB NTPC 2024 గ్రాడ్యుయేట్‌ ఫలితాలు విడుదల.. స్కోర్‌ కార్డు లింక్
బ్యాంక్‌ నుంచి రూపాయ తీయడం లేదు .. ఐటీ శాఖకు డౌట్‌ వచ్చి..
బ్యాంక్‌ నుంచి రూపాయ తీయడం లేదు .. ఐటీ శాఖకు డౌట్‌ వచ్చి..
Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్య పరిష్కారం కాబోతుంది..
Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్య పరిష్కారం కాబోతుంది..
బ్లాక్ డ్రెస్‌లో మతిపొగొట్టే అందాలు.. మీర్నా అదిరిపోయే ఫొటోస్
బ్లాక్ డ్రెస్‌లో మతిపొగొట్టే అందాలు.. మీర్నా అదిరిపోయే ఫొటోస్
ఆ స్టార్ హీరోకు స్టోరీ చెప్పిన ముగ్గురు యంగ్ డైరెక్టర్లు
ఆ స్టార్ హీరోకు స్టోరీ చెప్పిన ముగ్గురు యంగ్ డైరెక్టర్లు