Warangal: శునకానికి పదవీ విరమణ.. ఘనంగా వీడ్కోలు పలికిన జిల్లా అధికారులు..!
నేర పరిశోధనలో పోలీసులకు టెక్నాలజీ ఎంత ఉపయోగపడుతున్నా స్నీఫర్ డాగ్స్ పాత్ర ఎంతో కీలకం.. మత్తు పదార్థాలను పసిగట్టడంలో నేరస్తులను గుర్తించడంలో పోలీస్ జాగిలాలు పోలీసులకు ఎంతో సత్ఫలితాలు ఇస్తున్నాయి. వాటి పోషణకు వేలాది రూపాయలు వెచ్చిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాటి రిటైర్మెంట్ సందర్భంగా ఘన సత్కారం చేసి తగిన గౌరవాన్ని అందిస్తుంది..
నేర పరిశోధనలో పోలీసులకు టెక్నాలజీ ఎంత ఉపయోగపడుతున్నా స్నీఫర్ డాగ్స్ పాత్ర ఎంతో కీలకం.. మత్తు పదార్థాలను పసిగట్టడంలో నేరస్తులను గుర్తించడంలో పోలీస్ జాగిలాలు పోలీసులకు ఎంతో సత్ఫలితాలు ఇస్తున్నాయి. వాటి పోషణకు వేలాది రూపాయలు వెచ్చిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాటి రిటైర్మెంట్ సందర్భంగా ఘన సత్కారం చేసి తగిన గౌరవాన్ని అందిస్తుంది.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 12 సంవత్సరాల పాటు సేవలు అందించిన బ్రోనో అనే ట్రాకర్ డాగ్‌కు ఘనంగా వీడ్కోలు పలికి.. ఆ పోలీస్ జాగిలం సేవలను అభినందించారు.
ట్రాకర్ జాగిలింగా గుర్తింపు పొందిన బ్రోనో అనే జాగిలం 12 సంవత్సరాల క్రితం వరంగల్ కమిషనరేట్ కు అలాట్మెంట్ అయింది. పలువురు వీఐపీల భద్రతలో కీలక సేవలు అందించిన బ్రోనో, నేర పరిశోధనలను పోలీసులకు అత్యంత కీలక సేవలు సేవలందించింది. ఇప్పటివరకు వరంగల్ కమిషనర్ లో 15 క్లిష్టమైన కేసులను ఛేదించి నిందితులను గుర్తించడంలో సహాయపడింది. అయితే 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2025 ఆగస్టు 31వ తేదీతో పదవీ విరమణ పొందింది.. ఈ సందర్భంగా రిటైర్మెంట్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు జిల్లా పోలీసు అధికారులు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా వరంగల్ కమిషనర్ పోలీస్ సిబ్బంది బ్రోనోకు గౌరవ నమస్కారం సమర్పించి వీడ్కోలు పలికారు.. ఈ జాగిలం అందించిన సేవలను ప్రశంసించారు..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




