మూసీ వివాదంపై బీఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ కొత్త స్కెచ్‌.. సెంటిమెంటును పండిస్తున్నారా..?

మూసి విషయంలో బీఆర్ఎస్ రాజకీయాన్ని కాంగ్రెస్ నల్లగొండ సెంటిమెంట్ తో ఎదుర్కొంటోందట. దీనికి దీటుగా బీఆర్ఎస్ కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కార్యాచరణను రూపొందిస్తోందట.

మూసీ వివాదంపై బీఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ కొత్త స్కెచ్‌.. సెంటిమెంటును పండిస్తున్నారా..?
Congress BRS
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Nov 10, 2024 | 11:57 AM

ఆరు నూరైనా మూసీ నది పునరుజ్జీవం కోసం ముందుకు వెళతామని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆ దిశలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో మూసి పునర్జీవ సంకల్ప పాదయాత్రతో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. నల్లగొండ సెంటిమెంట్ ను పండించి.. బీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందన్న టాక్‌ వినిపిస్తోంది. వ్యూహాత్మకంగానే సీఎం రేవంత్ తన బర్త్ డే రోజున మూసీ పునర్జీవ సంకల్ప పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ నల్లగొండ సెంటిమెంటుకు దీటుగా బీఆర్ఎస్ మూసి ఎజెండాను సిద్ధం చేస్తోంది. మూసీ పాపం కాంగ్రెస్ దే అంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. నల్లగొండ సెంట్రిక్ గా మూసీ పునర్జీవనం కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య పొలిటికల్ వార్ గా మారింది.

మూసీ పునర్జీవనంపై కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య రాజకీయ మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. సీఎం రేవంత్ పాల్గొన్న మూసి పునర్జీవ సంకల్ప యాత్రతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. మూసీ పునర్జీవ సంకల్ప యాత్ర పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. మూసి ప్రక్షాళన చేసి తీరుతామని అధికార కాంగ్రెస్, అడ్డుకుంటామని బీఆర్ఎస్ ప్రకటించడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల రాజకీయ యుద్ధం మొదలైంది. హైదరాబాద్ కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్, బీజేపీ అగ్ర నేతలు విమర్శల దాడి చేస్తున్నారు. రేవంత్ సర్కార్ చేపట్టిన మూసీ పునర్జీవనంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ఎక్కుపెట్టడంతో మూసీ ప్రకంపనలు.. ఇపుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు తాకాయి. మూసీనది ప్రక్షాళన, పునర్జీవనంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలతో జిల్లాలో రాజకీయం మరింత వేడెక్కింది.

నల్లగొండ సెంటిమెంట్‌తో రాజకీయం..

రాష్ట్రంలో పొలిటికల్ వార్ గా మారిన మూసీ పునర్జీవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ గా తీసుకున్నారు. తన జన్మదినం రోజున మూసీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించి మూసీ పునర్జీవ సంకల్ప పాదయాత్రలో పాల్గొన్నారు. దీంతో మూసీ రాజకీయాలు నల్గొండ సెంట్రిక్ గా మారాయి. మూసీ ప్రక్షాళనే తప్పు అన్నట్టుగా బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను సీఎం రేవంత్ తిప్పి కొట్టారు. జనవరి తొలివారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి నుంచి పాదయాత్ర చేస్తానని రేవంత్ ప్రకటించారు. దీంతో మూసీ వివాదంపై బీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు.. సీఎం రేవంత్.. నల్లగొండ సెంటిమెంటును పండిస్తున్నారట. మూసీ కాలుష్య మురుగు నీటితో అష్టకష్టాలు పడుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల బాధలు తెలుసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగారట. మూసి ప్రక్షాళనను వ్యతిరేకిస్తే అది నల్లగొండ ప్రజల్ని వ్యతిరేకించినట్లేనన్న సెంటిమెంటును తీసుకు వచ్చేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తోందట. మూసిని రాజకీయ అంశం చేసి సెంటిమెంట్రే రేపితే బీఆర్ఎస్ ను ఇరకాటంలో పడేయొచ్చని కాంగ్రెస్ ప్లానట. అందుకే కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లాపై మూసీ అస్త్రం ప్రయోగిస్తోందట.

మూసీ పాపం ఎవరిది..?

కాంగ్రెస్ సర్కారు ప్రయోగిస్తున్న మూసి అస్త్రాన్ని.. బీఆర్ఎస్ నేతలు తిప్పికొడుతున్నారు. తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని.. దానిలోని దోపిడీకే వ్యతిరేకమని బీఆర్ఎస్.. రేవంత్ సర్కార్ పై విమర్శ దాడి కొనసాగిస్తాంది. అందుకే మూసి విషయంలో బీఆర్ఎస్ రాజకీయాన్ని కాంగ్రెస్ నల్లగొండ సెంటిమెంట్ తో ఎదుర్కొంటోందట. దీనికి దీటుగా బీఆర్ఎస్ కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కార్యాచరణను రూపొందిస్తోందట. సీఎం రేవంత్ పర్యటన రోజున ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ నేతల అరెస్టులు, ప్రభుత్వ దమన కాండను ప్రజలకు చెప్పాలని బీఆర్ఎస్ భావిస్తుందట. మూసి పాపం కాంగ్రెస్ దే అంటూ.. మూసి పరివాహక ప్రాంత ప్రజలను చైతన్య వంతులను చేసేందుకు బీఆర్ఎస్ దండయాత్రకు సిద్ధమవుతోందట. ఉమ్మడి నల్గొండ నుండి మూసి పునర్జీవనంపై పోరును మరింత ఉధృతం చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందట. బీఆర్ఎస్ అగ్ర నేతలు కేటిఆర్, హరీష్ రావులతో మూసి ఎజెండాగా జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని నేతల భావిస్తున్నారట.

మూసీ పునర్జీవన రాజకీయంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మాటల తూటాలతో రాజకీయం మరింత వేడెక్కింది. నల్లగొండ సెంట్రిక్ గా ఉన్న మూసి పాలిటిక్స్ ఎటు దారి తీస్తాయో చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..