Telangana: తండ్రి ప్రాణం తీసిన కొడుకు వివాహేతర సంబంధం.. భార్యను దక్కకుండా చేశారని..

మంచిర్యాల జిల్లాలో తనయుడి వివాహేతర బంధం తండ్రి హత్యకు దారితీసింది. ఈ దారణ ఘటన చెన్నూరు మండలం ముత్తరావుపల్లిలో చోటు చేసుకుంది. ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన పైడిపెల్లి మల్లయ్యను అదే గ్రామానికి చెందిన జాడి భూమయ్య హత్య చేశాడు..

Telangana: తండ్రి ప్రాణం తీసిన కొడుకు వివాహేతర సంబంధం.. భార్యను దక్కకుండా చేశారని..
Illegal Affair
Follow us
Naresh Gollana

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 10, 2024 | 1:58 PM

మంచిర్యాల జిల్లాలో తనయుడి వివాహేతర బంధం తండ్రి హత్యకు దారితీసింది. ఈ దారుణ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని ముత్తరావుపల్లిలో చోటుచేసుకుంది. చెన్నూరు పట్టణ సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన పైడి పెల్లి మల్లయ్య(50) అదే గ్రామానికి చెందిన జాడి భూమయ్య చేతిలో హత్యకు గురయ్యాడు. మల్లయ్య కొడుకు రాజశేఖర్ పై కక్ష పెంచుకున్న భూమయ్య.. మల్లయ్యను దారుణంగా చంపాడు.. మృతుడి కుమారుడు రాజశేఖర్ భూమయ్య భార్యను ఏడు నెలల క్రితం మరో ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. దీంతో భూమయ్య తన భార్య కనబడటం లేదని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తాజాగా, సహజీవనం చేస్తున్న జంటను గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కౌన్సిలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ వారిలో ఎలాంటి మార్పు కనిపించలేదు.. కౌన్సిలింగ్ లో తన భర్తతో ఉండేందుకు నిరాకరించిన వివాహిత తిరిగి మళ్లీ ప్రియుడితోనే వెళ్లిపోయింది. ఈ ఘటనతో తన పరువు పోయిందని.. సమాజంలో తలెత్తుకుని బతకలేక పోతున్నానని.. అందుకు కారణమైన రాజశేఖర్ కుటుంబాన్ని ఎలాగైనా మట్టుబెట్టాలని ఫిక్స్ అయ్యాడు వివాహిత భర్త భూమయ్య..

రాహశేఖర్ పై పగ తీర్చుకునేందుకు వృద్ధుడైన మల్లయ్యను టార్గెట్ చేశాడు భూమయ్య. గ్రామ సమీపంలోని వాగు వైపు బహిర్భూమికి వెళ్లిన మల్లయ్య పై తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో కిరాతకంగా నరికి హత్య చేశాడు భూమయ్య. సమీపంలోని చెరువులో మల్లయ్య మృతదేహాన్ని పడేసి పారిపోయాడు.

చెరువు వైపు వెళ్లిన స్థానికులకు మల్లయ్య మృతదేహం కనిపించడంతో కుటుంబసభ్యులకు, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హత్య చేసి చెరువులో పడేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్ పేర్కొన్నారు.

కొడుకు వివాహేతర సంబంధం కారణంగానే తండ్రి మల్లయ్య ప్రాణాలు పోగట్టుకున్నాడని.. తన భార్య తనకు‌ దక్కకుండా పోవడానికి కారణమైన రాజశేఖర్ కుటుంబాన్ని బలి తీసుకోవాలని భూమయ్య కక్ష పెంచుకోవడం కారణంగానే ఇంతటి దారుణం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..