రోజ్ వాటర్‌లో ఈ ఒక్కటి కలిపి రాస్తే..గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం!
Jyothi Gadda
25 December 2024
TV9 Telugu
చర్మ సంరక్షణకు రోజ్ వాటర్ ఉపయోగిస్తున్నారు. రోజ్ వాటర్ ముఖానికి చాలా మేలు చేస్తుంది. అంతే కాకుండా విటమిన్ ఇ కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
TV9 Telugu
రోజ్ వాటర్ విటమిన్-ఇ క్యాప్సూల్స్ రెండూ చర్మ సంరక్షణలో చాలా ప్రసిద్ధి. ఈ రెండూ చర్మ సంరక్షణకు చాలా ఉపయోగపడతాయి. అయితే ఈ రెండింటిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేస్తే..
TV9 Telugu
ఈ రెండింటి కలయిక చర్మాన్ని శాంతపరుస్తుంది. రోజ్ వాటర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మంపై ఎరుపును తగ్గించడంలో సహాయపడతాయి.
TV9 Telugu
రోజ్ వాటర్, విటమిన్ ఇ మిశ్రమం చర్మాన్ని టోన్ చేస్తుంది. రోజ్ వాటర్ చర్మం pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. అంతే కాకుండా దానిని టోన్ చేయడంలో సహాయపడుతుంది.
TV9 Telugu
చర్మ రంధ్రాలను మూసివేస్తుంది. రోజ్ వాటర్ చర్మం రంధ్రాలను మూసివేయడంలో సహాయపడుతుంది. చర్మంపై అదనపు నూనెలను తగ్గిస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.
TV9 Telugu
విటమిన్-ఇ అనేది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. విటమిన్ ఇ ముడతలు, ఫైన్ లైన్స్ వంటి వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. పొడిబారిన చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
TV9 Telugu
స్కిన్ కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. చర్మంపై ఉన్న డెడ్ స్కిన్, మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. అంతేకాకుండా వృద్ధాప్య లక్షణాలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.
TV9 Telugu
చర్మం దెబ్బతినకుండా కాపాడేందుకు విటమిన్ ఇ అద్భుతం చేస్తుంది. చర్మాన్ని తేమగా ఉండేలా చూస్తుంది. విటమిన్ ఇ చర్మంలో తేమను కాపాడడంలో సహాయపడుతుంది.