AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొనసాగుతున్న హూండీ లెక్కింపు.. ఇప్పటి వరకు ఆదాయం ఎంతంటే

ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగిన మేడారం(Medaram) జాతర హుండీ లెక్కింపు నాలుగోరోజు కొనసాగుతోంది. హన్మకొండ(Hanmakonda) లోని టీటీడీ కల్యాణ మండపంలో అధికారులు హుండీ లెక్కింపు చేపడుతున్నారు...

కొనసాగుతున్న హూండీ లెక్కింపు.. ఇప్పటి వరకు ఆదాయం ఎంతంటే
Medaram Jatara 2022
Ganesh Mudavath
|

Updated on: Feb 27, 2022 | 7:16 AM

Share

ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగిన మేడారం(Medaram) జాతర హుండీ లెక్కింపు నాలుగోరోజు కొనసాగుతోంది. హన్మకొండ(Hanmakonda) లోని టీటీడీ కల్యాణ మండపంలో అధికారులు హుండీ లెక్కింపు చేపడుతున్నారు. కాగా ఇప్పటి వరకు రూ.8 కోట్లు విలువైన కానుకలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గత నాలుగు రోజుల్లో 75 శాతం హుండీలు లెక్కించగా.. ఇంకా 114 హుండీలను లెక్కించాల్సి ఉంది. భక్తులు(Devotees) సమర్పించిన కానుకల్లో డబ్బులు, బంగారు, వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీ ఉన్నాయి. కరోనా పరిస్థితుల కారణంగా జాతరకు ముందు నంచే భక్తుల రాకతో సందడి నెలకొంది. దీంతో ఈ సారి హుండీ ఆదాయం భారీగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

తెలంగాణలో నాలుగురోజుల పాటు అట్టహాసంగా జరిగిన మేడారం మహాజాతర ముగిసింది. ఆఖరి రోజు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తులు.. అమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి.. డప్పు, డోలు వాయిద్యాలతో వన దేవతలను వన ప్రవేశం చేశారు. విద్యుద్దీపాలు నిలిపేసిన అనంతరం, వన దేవతలను గద్దెల నుంచి తరలించారు. అమ్మవార్లు అడవికి తరలుతున్న సమయంలో మేడారం పరిసరాలు భక్తుల జయజయధ్వానాలతో మార్మోగాయి. సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి తీసుకెళ్లారు. పగిడిద్ద రాజును మహబూబాబాద్​ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయికి తీసుకెళ్లడంతో వన ప్రవేశ ఘట్టం ముగిసింది.

ఎన్నడూ లేనంతగా ఈసారి జాతరకు నెల రోజుల ముందు నుంచే మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. 50 లక్షల మందికి పైగా భక్తులు.. జాతరకు ముందే దర్శనాలు చేసుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నారు. కోటీ 30 లక్షల మంది భక్తులు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నట్లు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, ఇంద్రకరణ్​రెడ్డి వెల్లడించారు. మళ్లీ రెండేళ్లకు జనం మధ్యకు వనదేవతలు రానున్నారు.

Also Read

Russia Ukraine Crisis: వార్‌ విషయంలో వెనక్కు తగ్గేదేలే.. 2008 జార్జియాపై దాడిని గుర్తుచేస్తూ రష్యా మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..

Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌.. రెండు దేశాలలో ఎవరు ఎక్కువ శక్తివంతులు

Russia – Ukraine Conflict: పారిపోను.. ఆయుధాలివ్వండి.. అమెరికా ఆఫర్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడి రిప్లై..