Mallu Bhatti Vikramarka: నేటి నుంచి భట్టి పాదయాత్ర.. పీపుల్స్ మార్చ్‌ పేరుతో ప్రజల్లోకి..

కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) పాదయాత్ర కు శ్రీకారం చుడుతున్నారు. గతంలో సైకిల్ ర్యాలీలు, మోటార్ బైక్ ర్యాలీలు, ఎడ్ల బండ్ల ర్యాలీలను నిర్వహించిన భట్టి విక్రమార్క ఈసారి ప్రజా సమస్యలను క్షేత్రాస్థాయిలో తెలుసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Mallu Bhatti Vikramarka: నేటి నుంచి భట్టి పాదయాత్ర.. పీపుల్స్ మార్చ్‌ పేరుతో ప్రజల్లోకి..
Bhatti Vikramarka
Follow us

|

Updated on: Feb 27, 2022 | 6:45 AM

కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) పాదయాత్ర కు శ్రీకారం చుడుతున్నారు. గతంలో సైకిల్ ర్యాలీలు, మోటార్ బైక్ ర్యాలీలు, ఎడ్ల బండ్ల ర్యాలీలను నిర్వహించిన భట్టి విక్రమార్క ఈసారి ప్రజా సమస్యలను క్షేత్రాస్థాయిలో తెలుసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి27) నుంచి పీపుల్స్ మార్చ్‌ ( Peoples March)పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు. సొంత నియోజకవర్గమైన మధిర నుంచి మొదలయ్యే ఈ యాత్ర 32రోజుల పాటు మొత్తం 506 కిలోమీటర్లు సాగనుంది. ముదిగొండ మండలం యడవల్లి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత పాదయాత్ర ప్రారంభించనున్నారు భట్టి. ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ముగింపు సభ ఉంటుంది. ప్రతిరోజు 15నుంచి 20 కిలోమీటర్లకుగా పైగా పాదయాత్ర ఉండేలా ప్లాన్ చేశారు.

కాగా ఈ పాదయాత్రలో భాగంగా గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన హామీల అమలుతీరు, ప్రజాసమ్యలను ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు భట్టి. ప్రజలనుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారు. ప్రధానంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, అర్హులైన వారికి పింఛన్లు, నిరుద్యోగభృతి, ఉద్యోగవకాశాల కల్పన, రైతులకుగిట్టుబాటు ధరలు, పెరిగిన నిత్యావసర ధరలు, ఆరోగ్యశ్రీ పథకం, విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాల అమలు తీరును పరిశీలించనున్నారు . కాగా మధిరలో పీపుల్స్‌మార్చ్ పూర్తైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టే ఆలోచనలో కూడా ఉన్నారు . పాదయాత్ర ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతోపాటు..మధిర నియోజకవర్గంపై తన పట్టును నిలుపుకోవాలని భావిస్తున్నారు భట్టివిక్రమార్క.

Also Read:IND vs SL: ధర్మశాల చరిత్ర మార్చిన రోహిత్ సేన.. లంకపై 7 వికెట్ల తేడాతో విజయం.. రాణించిన శ్రేయాస్, జడేజా, శాంసన్

Bayyaram Steel Plant: తెలంగాణలో మరో ఉద్యమం.. తగ్గేదే లే అంటున్న రాష్ట్ర సర్కార్..

Telangana: అంతా ఒరిజినల్‌ అన్నారు.. ఢోకా లేనే లేదన్నారు.. చివరకు వారు చేసి పని ఇది..!