Russia Ukraine Crisis: వార్ విషయంలో వెనక్కు తగ్గేదేలే.. 2008 జార్జియాపై దాడిని గుర్తుచేస్తూ రష్యా మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
Russia-Ukraine War: ఉక్రెయిన్-రష్యా సంక్షోభం ముదిరి పాకాన పాడుతోంది. రష్యా దళాలు గత మూడు రోజులుగా ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తునే ఉన్నాయి.
Russia-Ukraine War: ఉక్రెయిన్-రష్యా సంక్షోభం ముదిరి పాకాన పాడుతోంది. రష్యా దళాలు గత మూడు రోజులుగా ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తునే ఉన్నాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో ఏమాత్రం తగ్గడం లేదంటోన్న రష్యా పై ఆయా దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. చివరకు యూరోపియన్ యూనియన్ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే రష్యా మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో వెనకడుగు వేసేది లేదంటోంది. కాగా వివిధ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తుండడంపై ఆ దేశ మాజీ ప్రధాని, భద్రతా మండలి డిప్యూటీ హెడ్ దిమిత్రి మెద్వెదెవ్ (Dmitry Medvedev) సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘అమెరికా సహా దాని మిత్ర దేశాలు రష్యాపై అద్భుతమైన ఆంక్షలు విధిస్తున్నాయి. వీటితో మా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదు. మా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనుకున్న లక్ష్యాలను సాధించేవరకు ఈ సైనిక చర్య కొనసాగుతుంది. 2008లో జరిగిన జార్జియా విషయంలో ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. . అప్పటి పరిస్థితులే ఇప్పుడు కూడా కొనసాగుతాయి. ఆంక్షలు అనేవి తాత్కాలికం . అమెరికా విదేశాంగ శాఖలోని ప్రతినిధులకు కూడా ఈ విషయం స్పష్టంగా తెలుసు’ అని మెద్వెదెవ్ చెప్పుకొచ్చారు. కాగా ఇప్పటిలాగే 2008లో రష్యా జార్జియాపై ఇలాగే దాడులకు తెగబడింది.
Bayyaram Steel Plant: తెలంగాణలో మరో ఉద్యమం.. తగ్గేదే లే అంటున్న రాష్ట్ర సర్కార్..
Andhra Pradesh: తెలుగుదేశంలో కొత్త చర్చ.. ఆ శపథమే కారణం.. ఇంతకీ ఏం నిర్ణయం తీసుకుంటారో..!