
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లు వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో బాగంగానే ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలోనూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లు కూడా వెంటనే సిద్ధం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేయాలని భావించింది ప్రభుత్వం. గవర్నర్ ఆమోదం కోసం రెండోరోజు సభ ముగిసేవరకు ఎదురుచూసింది ప్రభుత్వం. అయితే, రాజ్‌భవన్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడం ఉత్కంఠ రేపింది. ఎలాగైనాసరే బిల్లును పాస్ చేయాలన్న సంకల్పంతో ఉంది ప్రభుత్వం. మరి, అసెంబ్లీ సెషన్స్ ముగిసేలోగా బిల్లుపై గవర్నర్ సంతకం చేస్తారా? లేదా?. చివరి రోజు ఏం జరగనుందో చూడాలి!
కాగా, తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య హైవోల్టేజ్ వార్ జరిగింది. రెండు పార్టీలు కూడా తగ్గేదే లేదంటూ యుద్ధానికి దిగాయ్!. మాటకు మాట, సవాల్‌కి ప్రతి సవాల్, కౌంటర్‌కి రీకౌంటర్ ఇస్తూ సభను హీటెక్కించాయి ఇరువర్గాలు. వరద సాయంపై జరిగిన ఈ వార్‌లో ఎవరేమన్నారో ఇప్పుడు చూద్దాం.
రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ హీటెక్కిపోయింది. వరద రాజకీయంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి శాసనసభ వేడెక్కి కాకరేపింది. వరద సాయంపై కాంగ్రెస్, ప్రభుత్వం మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు వర్సెస్ మినిస్టర్స్‌గా అన్‌స్టాపబుల్ డైలాగ్ వార్ సాగింది.
మార్నింగ్ సెషన్ అంతా నార్మల్‌గానే జరిగింది. కానీ, సెకండ్ సెషన్‌కి వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. లంచ్ బ్రేక్ తర్వాత అసలుసిసలు ఫైట్ మొదలైంది. ఒకపక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఇంకోపక్క ముగ్గురు మంత్రులు. ఇరువర్గాలు కూడా తగ్గేదేలే లేదంటూ దూకుడు చూపించాయ్!. సై అంటే సై అంటూ ఢీకొట్టారు. వరదలు, పరిహారంపై ప్రభుత్వాన్ని శ్రీధర్‌బాబు ప్రశ్నిస్తే.. ఏంటా గాలి మాటలంటూ ఎదురుదాడికి దిగారు మంత్రులు. ముందు కేటీఆర్, ఆ తర్వాత వేముల ప్రశాంత్‌రెడ్డి, హరీష్‌రావు.. ఒకరి తర్వాత మరొకరు కౌంటర్ ఎటాక్ చేశారు. మధ్యలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క కూడా ఈ హైవోల్టేజ్ వార్‌లోకి వచ్చారు. సుమారు రెండు గంటలపాటు ఈ మాటల యుద్ధం కొనసాగింది.
మంత్రుల నాన్‌స్టాప్ ఎటాక్‌తో సభ నుంచి వాకౌట్ చేసింది కాంగ్రెస్. సభలో తమను మాట్లాడనీయడం లేదంటూ నిరసన తెలిపారు. ఆ తర్వాత విద్యా వైద్య రంగాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్‌రావు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..