AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చిగురిస్తున్న ఆశలు.. తెలంగాణలో కొత్తగా 4 ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్కడంటే..

విమానాశ్రయాల విస్తరణ ప్రణాళికలు ఊపందుకున్నాయి.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త విమానాశ్రయాల ఏర్పాటు కోసం ప్రణాళికలు వేగవంతం చేస్తోంది. ప్రస్తుతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే వినియోగంలో ఉండగా, బేగంపేట విమానాశ్రయం పరిమిత వినియోగం కింద మాత్రమే ఉంది.

Telangana: చిగురిస్తున్న ఆశలు.. తెలంగాణలో కొత్తగా 4 ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్కడంటే..
Airport
Prabhakar M
| Edited By: |

Updated on: Nov 25, 2024 | 6:51 PM

Share

విమానాశ్రయాల విస్తరణ ప్రణాళికలు ఊపందుకున్నాయి.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త విమానాశ్రయాల ఏర్పాటు కోసం ప్రణాళికలు వేగవంతం చేస్తోంది. ప్రస్తుతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే వినియోగంలో ఉండగా, బేగంపేట విమానాశ్రయం పరిమిత వినియోగం కింద మాత్రమే ఉంది. తాజాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్, రామగుండం, కొత్తగూడెం, ఆదిలాబాద్ ప్రాంతాల్లో విమానాశ్రయాల అభివృద్ధి పై దృష్టి పెట్టామని ప్రకటించారు. గతంలోనూ ఈ ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని ప్రాథమిక చర్యలు చేపట్టినప్పటికీ, వివిధ కారణాల వల్ల అవి పూర్తి కాలేదు. అయితే, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది.

వ‌రంగ‌ల్ మామునూరు ఏయిర్ పోర్ట్..

మామూనూరు ఏయిర్ పోర్ట్ పునరుద్ధరణకు శ్రీకారం చుడుతుంది ప్ర‌భుత్వం.. వరంగల్‌లో మామునూరు విమానాశ్రయం గతంలో నిజాం కాలంలో వాణిజ్య ప్రయాణాల కోసం వినియోగించారు. ఇప్పుడు 696 ఎకరాల భూమిని కేటాయించడంతో ఏయిర్ పోర్ట్ పునరుద్ధరించబడుతుందనే ఆశలు మ‌ళ్లి చిగురిస్తున్నాయి. ప్రాథమికంగా చిన్న విమానాల రాకపోకల కోసం దీన్ని అభివృద్ధి చేయాలని, తదుపరి దశలో పెద్ద విమానాలు, కార్గో సర్వీసులకు అనుకూలంగా మార్పులు చేయాలని ప్రణాళికలు ఉన్నాయి.

మొదటి దశలో మామునూరు విమానాశ్రయాన్ని చిన్న విమానాల రాకపోకలకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నారు. మాస్టర్‌ ప్లాన్‌ తయారీ, ఎయిర్‌పోర్టు అభివృద్ధికి 8 నెలల గడువును లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పెట్టుకుంది.. రెండో దశలో పెద్ద విమానాలు, కార్గో విమానాల ఆపరేషన్‌కు వీలుగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది

రామగుండం, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,000 ఎకరాలకు పైగా భూమి కేటాయింపు జరగనుంది. రామగుండంలో, బసంత్‌నగర్ వద్ద ఒకవైపు పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆదిలాబాద్‌లో సుమారు 1,592 ఎకరాలు ఇప్పటికే గుర్తించారు అధికారులు.. అక్కడ భూసేకరణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది.

పౌరవిమానయాన శాఖలో తెలుగు ప్రతినిధి.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నందున కేంద్రం నుంచి అనుమతుల విషయంలో సహకారం లభించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

మిగిలిన ప్రాంతాలపై సందిగ్ధత..

మహబూబ్‌నగర్ – నిజామాబాద్ జిల్లాల్లోనూ విమానాశ్రయాల ఏర్పాటు ప్రయత్నాలు గతంలో జరిగాయి. కానీ వాటికి అనుకూల పరిస్థితులు లేవని ఎయిర్పోర్ట్ అథారిటీ నిర్ధారించింది. దీంతో, ప్రభుత్వం ప్రధానంగా వరంగల్, కొత్తగూడెం, రామగుండం,, ఆదిలాబాద్ మీద దృష్టి సారించింది. ఈ ప్రణాళికలతో రాష్ట్రంలో ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించడంతో పాటు, పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్యం, పర్యాటక రంగాలకు కొత్త ఊపును తెచ్చే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..