Telangana: అద్దెకుండే వారికి ఉచిత కరెంట్ వర్తించదా.? అధికారులు ఏమంటున్నారంటే..
ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే గృహ జ్యోతి పథకానికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. గృహ జ్యోతి పథకానికి మార్గదర్శాలు ఇవే అంటూ ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. ఒక ఇంటికి ఒక మీటరుకే పథకం అమలు ఉంటుందని. కిరాయికి ఉండేవారు ఈ పథకానికి అర్హులు కాదని, అలాగే..

ఎన్నికల హామీ నేపథ్యం కాంగ్రెస్ పార్టీ గృహ జ్యోతి పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. కాగా పార్లమెంట్ ఎన్నికలలోపే గృహజ్యోతి పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు మొదలు పెట్టింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతం కావడంతో ఉచిత విద్యుత్‌ను కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే గృహ జ్యోతి పథకానికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. గృహ జ్యోతి పథకానికి మార్గదర్శాలు ఇవే అంటూ ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. ఒక ఇంటికి ఒక మీటరుకే పథకం అమలు ఉంటుందని. కిరాయికి ఉండేవారు ఈ పథకానికి అర్హులు కాదని, అలాగే.. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 2181 యూనిట్ల లోపు వాడకం ఉండాలని, గతేడాది మొత్తం ఓ వినియోగదారుడు 1500 యూనిట్లు వాడితే దానికి 10 శాతం కలిపి 1650 యూనిట్లను 12 నెలలకు విభజించి నెలకు 137 యూనిట్లు ఉచితంగా ఇస్తారు. ఆ పైన వాడితే బిల్లు లెక్క కడతారు అంటూ ఓ సమాచారం వైరల్‌గా మారింది.
Tenants are also eligible under proposed Gruha Jyothi Scheme
Below post by @TeluguScribe is FAKE https://t.co/Ive0FG09dG
— TSSPDCL (@TsspdclCorporat) February 6, 2024
అయితే దీనిపై విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. అద్దెకు ఉంటున్న వారికి ఉచిత విద్యుత్ పథకం అమలు కాదన్నదాంట్లో ఎలాంటి నిజం లేదని, ఇది పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు. గృహజ్యోతి పథకం కింద అద్దెకుండే వారు కూడా అర్హులని, ఈ విషయంపై జరుగుతోన్న ప్రచారం ఫేక్ అని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇదిలా ఉంటే విద్యుత్ మీటర్‌కు ఆధార్ కార్డు, రేషన్ కార్డు నెంబర్లను లింక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. పథకానికి ఈ లింకేజ్ తప్పనిసరి అని, విద్యుత్ సిబ్బందికి ఆధార్, రేషన్ కార్డు నెంబర్లు చూపి విద్యుత్ సర్వీస్ నెంబర్‌కు లింక్ చేసుకోవాలని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




