AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagoba Jatara: ప్రారంభమైన నాగోబా జాతర.. కీలక ఘట్టానికి అంకురార్పణ.!

Nagoba Jatara: ప్రారంభమైన నాగోబా జాతర.. కీలక ఘట్టానికి అంకురార్పణ.!

Anil kumar poka
|

Updated on: Feb 06, 2024 | 4:34 PM

Share

అడవుల జిల్లా మేస్రం వంశీయుల మహా పూజలతో పులకించి పోతోంది. ప్రకృతినే దైవంగా పూజించే ఆదివాసీల మహా జాతరకు వేళయింది. చెట్టును , పుట్టను , మట్టిని , మానును , జలాన్ని భక్తి‌శ్రద్దలతో మొక్కే జాతర నాగోబాకు మొదటి అడుగుపడింది. నాగోరే నాగోబా అంటూ కెస్లాపూర్ నుండి హస్తినమడుగుకు కదిలిన మేస్రం వంశీయులు గంగాజలాన్ని సేకరించి ప్రధాన పూజకు ఆనతినియ్యమంటూ ఆది దేవత ఇంద్రాదేవిని వేడుకున్నారు.

అడవుల జిల్లా మేస్రం వంశీయుల మహా పూజలతో పులకించి పోతోంది. ప్రకృతినే దైవంగా పూజించే ఆదివాసీల మహా జాతరకు వేళయింది. చెట్టును , పుట్టను , మట్టిని , మానును , జలాన్ని భక్తి‌శ్రద్దలతో మొక్కే జాతర నాగోబాకు మొదటి అడుగుపడింది. నాగోరే నాగోబా అంటూ కెస్లాపూర్ నుండి హస్తినమడుగుకు కదిలిన మేస్రం వంశీయులు గంగాజలాన్ని సేకరించి ప్రధాన పూజకు ఆనతినియ్యమంటూ ఆది దేవత ఇంద్రాదేవిని వేడుకున్నారు. ఆదివాసీల ఆచార సంప్రదాయం ప్రకారం గంగాజలంతో ఇంద్రాదేవి ఆలయ ఆవరణలోని మర్రి చెట్టుపై గంగాజల ఝరిని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగోబా అభిషేకం కోసం జనవరి 21 న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నుండి కదిలిన మేస్రం శ్వేత సైన్యం.. 204 మందితో నాలుగు మండలాలు 22 మారుమూల గ్రామాల మీదుగా 125 కిలో మీటర్లు ప్రయాణించి జనవరి 28 న మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు సమీపంలోని గోదావరి హస్తలమడుగులో పవిత్ర జలాన్ని సేకరించారు. అనంతరం తిరుగు ప్రయాణం అయిన మేస్రం వంశీయులు ఫిబ్రవరి 1 న దొడంద లోని కఠోడ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ రెండు రోజులు గంగాజల కలశాన్ని మామిడి చెట్టు పై భద్రపరిచి విడిది చేశారు. తిరిగి సోమవారం దొడంద నుండి కాలినడకన బయలుదేరి ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకున్నారు. 200 మంది కి పైగా సకుటుంబ సమేతంగా పిల్లపాపలతో ఎడ్లబండ్లపై తరలి వచ్చారు.

అమ్మవారిని దర్శించుకున్న మేస్రం మహిళలు ప్రత్యేకమైన పిండి వంటలను ఇంద్రాదేవికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం అందరూ సహపంక్తి భోజనాలు చేసి ఆదివాసీ వాయిద్యాల నడుమ కేస్లాపూర్ లోని మర్రిచెట్ల వద్దకు చేరుకున్నారు. పవిత్ర గంగాజలం కోసం చేసిన తమ పాదయాత్ర క్షేమంగా జరిగిందని.. నాగోబా జాతరలోని కీలక‌ ఘట్టానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడమని ఆ అమ్మవారిని వేడుకున్నామని తెలిపారు మేస్రం‌ పెద్దలు. ప్రకృతి సిద్దమైన పదార్ధాలతోనే వంటకాలు చేయడం తమ ఆచారమని తెలిపారు మేస్రం ఆడపడుచులు. నువ్వుల నూనెతో బూరెలు, మక్క గారెలు, గట్కా వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించామన్నారు. చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న ఆదివాసీ సమాజం ఈ జాతరలో ఒక్కచోట కలుసు కోవడం మరుపు రాని అనుభూతులను పంచుతుందని చెప్తున్నారు. ఫిబ్రవరి 9న అమావాస్య అర్థరాత్రి గంగా జలం మహాభిషేకంతో నాగోబా జాతర ప్రారంభం కానుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..