Watch Video: శభాష్ రా తెలుగోడా.. అంబానీ పెళ్లిలో అరుదైన గౌరవం..
అంబానీ ఇంట పెళ్లిని దేశమే కాదు.. ప్రపంచం అంతా కళ్లప్పగించి, ముక్కున వేలేసుకుని మరీ చూసింది. అంతేకాదు ఈ పెళ్లిలో దేశంలోని చాలామంది పండితులు, కళాకారులు తమ వంతు పాత్ర పోషించారు. అంబానీ మ్యారేజ్‌లో తెలుగు సందడి కూడా ఉంది. మన పండితులు, కళాకారుల ప్రతిభకు ముకేష్ అంబానీ కూడా ఆశ్చర్యపోయారట.
అంబానీ ఇంట పెళ్లిని దేశమే కాదు.. ప్రపంచం అంతా కళ్లప్పగించి, ముక్కున వేలేసుకుని మరీ చూసింది. అంతేకాదు ఈ పెళ్లిలో దేశంలోని చాలామంది పండితులు, కళాకారులు తమ వంతు పాత్ర పోషించారు. అంబానీ మ్యారేజ్‌లో తెలుగు సందడి కూడా ఉంది. మన పండితులు, కళాకారుల ప్రతిభకు ముకేష్ అంబానీ కూడా ఆశ్చర్యపోయారట.
అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహ వేడుక జరుగుతుండగా, వాళ్లను వేద మంత్రాలతో కోనసీమ ఘనాపాఠీలు ఆశీర్వదించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట నుంచి అంబానీ ఇంట వివాహ వేడుకకు హాజరయ్యారు ఈ వేద పండితులు. నవ దంపతులకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఐదు రోజుల పాటు ముంబైలో జరిగిన ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్న కోనసీమ ఘనాపాఠీలు, తమ వేద మంత్రోచ్చారణలతో అంబానీ కుటుంబాన్ని కూడా ఆకట్టుకున్నారు. కోనసీమ జిల్లా నందంపూడి గ్రామానికి చెందిన కర్ర విశ్వనాథ ఘనాపాఠి, పాసర్లపూడి లంకకు చెందిన గంటి భార్గవ్ ఘనాపాఠి, ఇందుపల్లి కి చెందిన గొర్తి సాంబశివ ఘనపాఠి,కమలేష్ ఘనాపాఠీలు కొత్త దంపతులను వేద మంత్రాలతో ఆశీర్వదించారు.
ఇక కరీంనగర్ కళాకారుల చేతిలో ప్రాణం పోసుకున్న ఫిలిగ్రీ కళాకృతులు అంబానీ ఫ్యామిలీని మెస్మరైజ్ చేశాయి. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళ గురించి అంబానీ ఫ్మామిలీ వినడంతో దాదాపు ఏడాదిన్నర కాలంగా సిఫ్కో ప్రతినిధుల ద్వారా వాళ్లతో లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబాని మ్యారేజ్ ఫిక్స్ అయినప్పటి నుండి కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కరీంనగర్ కళాకారుల చేతిలో రూపుదిద్దుకున్న సిల్వర్ పిలిగ్రీ కళాకృతుల నమూనాలను అంబానీ ఫ్యామిలీకి పంపించారు ఎలగందల కళాకారులు. ఇక ప్రి వెడ్డింగ్ షూట్ ప్రోగ్రాం నుంచి కూడా వివాహ వేడుక దాకా అంబానీ ఫ్యామిలీకి రకరకాల మోడల్స్ తయారు చేసి పంపించారు మన కరీంనగర్ కళాకారులు. ప్రత్యేక ఆర్డర్లకు అనుగుణంగా స్పెషల్ డిజైన్లతో ఫిలిగ్రీ కళాకృతులను తయారు చేసి అంబానీ కుటుంబానికి పంపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..