Video: ములుగు ఏజెన్సీలో DMHO బృందం సాహసం.. 20 కుటుంబాల కోసం ఏకంగా 15 కిమీలు..

ములుగు ఏజెన్సీలో గిరిజనులకు వైద్యం అందించేందుకు DMHO బృందం చేసిన సాహసం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. 20 కుటుంబాల ప్రాణాలు కాపాడటం కోసం వైద్యుల బృందం పెద్ద సాహసమే చేసింది. జ్వరాలతో మంచం పట్టిన గూడెం బిడ్డలకు వైద్యం అందించేందుకు DMHO అప్పయ్యతో కలిసి వైద్య బృందమంతా 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. అసలే వర్షం.. ఆపై వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి.

Video: ములుగు ఏజెన్సీలో DMHO బృందం సాహసం.. 20 కుటుంబాల కోసం ఏకంగా 15 కిమీలు..
Mulugu
Follow us

|

Updated on: Jul 18, 2024 | 9:09 PM

ములుగు ఏజెన్సీలో గిరిజనులకు వైద్యం అందించేందుకు DMHO బృందం చేసిన సాహసం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. 20 కుటుంబాల ప్రాణాలు కాపాడటం కోసం వైద్యుల బృందం పెద్ద సాహసమే చేసింది. జ్వరాలతో మంచం పట్టిన గూడెం బిడ్డలకు వైద్యం అందించేందుకు DMHO అప్పయ్యతో కలిసి వైద్య బృందమంతా 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. అసలే వర్షం.. ఆపై వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. కారడవిలో కొండలు, గుట్టలు ఎక్కుతూ.. మధ్యలో 3 వాగుల్ని దాటుకుంటూ దాదాపు 15 కిలోమీటర్లు ప్రయాణం చేసి గిరిజనులకు మందులు అందించారు.

ప్రస్తుతం వర్షాల కారణంగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నా.. ధైర్యం చేసి అంతా కలిసి మారుమూల ప్రాంతానికి వెళ్లారు. ఛత్తీస్ గడ్ – తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అడవుల్లో, ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో పెనుగోలు గ్రామం ఉంటుంది. అక్కడి దట్టమైన అడవిలోకి కనీసం ఎడ్ల బండి కూడా వెళ్లేదారి ఉండదు.

ఈ గుట్టపై దాదాపు 50 ఏళ్ల క్రితం నుంచి ఉన్న ఈ గిరిజన గ్రామంలో చాలా మంది ఇప్పుడు జ్వరాలతో బాధపడుతున్నారు. వీరికి ట్రీట్‌మెంట్‌ చేసేందుకు వెళ్లిన DMHO టీమ్‌కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

డాక్టర్ అప్పయ్యతో పాటు వైద్య సిబ్బంది అంతా భుజాన కిట్‌లు మోసుకుంటూ.. వాగులు దాటుకుంటూ అక్కడికి వెళ్లారు. గ్రామస్థుల్లో కొందరు తీవ్రమైన అనారోగ్యానికి గురవడంతో.. వారి రక్త నమూనాలు కూడా తీసుకున్నారు. అందరికీ ట్రీట్‌మెంట్‌ చేసిన తర్వాత రాత్రికి అక్కడే బస చేసి తర్వాత తిరిగి వచ్చారు. విధి నిర్వహణలో వైద్యసిబ్బంది చూపించిన చొరవను మంత్రి సీతక్క అభినందించారు.

ములుగు ఏజెన్సీలో DMHO బృందం సాహసం..
ములుగు ఏజెన్సీలో DMHO బృందం సాహసం..
ఎండుద్రాక్షను నీళ్లలో మరిగించి తింటే అద్భుత ఫలితాలు.. తెలిస్తే అస
ఎండుద్రాక్షను నీళ్లలో మరిగించి తింటే అద్భుత ఫలితాలు.. తెలిస్తే అస
వాట్సాప్‌లో అదిరే ఫీచర్.. మీ ఫ్రెండ్స్‌కు మరింత దగ్గరయ్యేలా..!
వాట్సాప్‌లో అదిరే ఫీచర్.. మీ ఫ్రెండ్స్‌కు మరింత దగ్గరయ్యేలా..!
నథింగ్‌ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌.. రూ. 16 వేల తగ్గింపు..
నథింగ్‌ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌.. రూ. 16 వేల తగ్గింపు..
బెల్లంతో చ‌ర్మ సౌంద‌ర్యం.. ఇలా చేస్తే నవ యవ్వనం మీ సొంతం..!
బెల్లంతో చ‌ర్మ సౌంద‌ర్యం.. ఇలా చేస్తే నవ యవ్వనం మీ సొంతం..!
3 ఫార్మాట్లను శాసించే ముగ్గురు మొనగాళ్లు.. ఫ్యూచర్ మాన్‌స్టర్‌లు
3 ఫార్మాట్లను శాసించే ముగ్గురు మొనగాళ్లు.. ఫ్యూచర్ మాన్‌స్టర్‌లు
మరింత చౌకగా మొబైల్ ఫోన్స్.. నిర్మలమ్మ పద్దుపై ఆశలెన్నో..!
మరింత చౌకగా మొబైల్ ఫోన్స్.. నిర్మలమ్మ పద్దుపై ఆశలెన్నో..!
డార్క్ చాక్లెట్‌తో ప్రయోజనాలెన్నో..! తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
డార్క్ చాక్లెట్‌తో ప్రయోజనాలెన్నో..! తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
రామ్ చరణ్‏తో సినిమా చేసేందుకు రెడీ.. డైరెక్టర్ కృష్ణవంశీ..
రామ్ చరణ్‏తో సినిమా చేసేందుకు రెడీ.. డైరెక్టర్ కృష్ణవంశీ..
బడ్జెట్‌పైనే ఆ రంగాల ఆశలన్నీ..విమాన,రైలు టిక్కెట్లు తగ్గనున్నాయా?
బడ్జెట్‌పైనే ఆ రంగాల ఆశలన్నీ..విమాన,రైలు టిక్కెట్లు తగ్గనున్నాయా?
శ్రీవారి దర్శనానికి వెళ్లి.. ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన భక్తుడు
శ్రీవారి దర్శనానికి వెళ్లి.. ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన భక్తుడు
మహిళలను భయపెడుతున్న కొలెస్ట్రాల్.. కొత్త లక్షణాలు ఇవే
మహిళలను భయపెడుతున్న కొలెస్ట్రాల్.. కొత్త లక్షణాలు ఇవే
రామసేతు వంతెన కల్పన కాదు.. నిజం..
రామసేతు వంతెన కల్పన కాదు.. నిజం..
వావి వరుసలు మరిచి దారుణం.. సొంత చెల్లిని కూడా ??
వావి వరుసలు మరిచి దారుణం.. సొంత చెల్లిని కూడా ??
మా తెలుగు టీచర్‌కి తెలుగే రాదు.. కలెక్టర్‌కి విద్యార్థుల ఫిర్యాదు
మా తెలుగు టీచర్‌కి తెలుగే రాదు.. కలెక్టర్‌కి విద్యార్థుల ఫిర్యాదు
అనంత్‌ అంబానీ వివాహం.. తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
అనంత్‌ అంబానీ వివాహం.. తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
అక్రమ మద్యం పట్టుకోడానికి వెళ్లిన పోలీసులు. అక్కడ సీన్‌ చూసి షాక్
అక్రమ మద్యం పట్టుకోడానికి వెళ్లిన పోలీసులు. అక్కడ సీన్‌ చూసి షాక్
ఉదయాన్నే ఈ జ్యూస్‌ ఒక్క గ్లాస్‌ తాగండి.. ఫలితం మీరే చూడండి !!
ఉదయాన్నే ఈ జ్యూస్‌ ఒక్క గ్లాస్‌ తాగండి.. ఫలితం మీరే చూడండి !!
రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీళ్లు తాగితే ఉపయోగాలు తెలుసా ?
రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీళ్లు తాగితే ఉపయోగాలు తెలుసా ?
వర్షంతో నీటమునిగిన రోడ్డు.. కాలేజీ ప్రిన్సిపాల్ ఏం చేశాడో తెలుసా
వర్షంతో నీటమునిగిన రోడ్డు.. కాలేజీ ప్రిన్సిపాల్ ఏం చేశాడో తెలుసా